యాంకర్ సుమ చేసిన పనితో వాళ్లు షాక్.. సడన్‌గా అక్కడికి వెళ్లి..

యాంకర్ సుమ రాజీవ్ కనకాల

యాంకర్ సుమ.. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకులకు విడదీయరాని అనుబంధం ఉంది. రెండు దశాబ్ధాలుగా ఈమె బుల్లితెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. వయసు 40 దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో ఆమెను..

  • Share this:
యాంకర్ సుమ.. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకులకు విడదీయరాని అనుబంధం ఉంది. రెండు దశాబ్ధాలుగా ఈమె బుల్లితెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. వయసు 40 దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో ఆమెను అందుకునే శక్తి కానీ.. దాటే అర్హత కానీ ఎవరికీ కనిపించడం లేదు. కనీసం సుమ దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించడం లేదు. ఇప్పుడు ఈమె తన ఇమేజ్‌ను బుల్లితెరతో పాటు సోషల్ మీడియా, డిజిటల్‌‌కు కూడా పాకేలా చేసింది. ఈ మధ్యే సుమక్క అనే యూ ట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి అందులో కొన్ని ఫన్నీ వీడియాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా పోస్ట్ చేస్తుంది.
Anchor Suma Kanakala posted an interesting video in Sumakka Channel and told about her childhood pk యాంకర్ సుమ.. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకులకు విడదీయరాని అనుబంధం ఉంది. రెండు దశాబ్ధాలుగా ఈమె బుల్లితెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. వయసు 40 దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో ఆమెను.. Suma Kanakala,Suma Kanakala you tube,Suma Kanakala sumakka channel,Suma Kanakala movies,Suma Kanakala twitter,Suma Kanakala facebook,Suma Kanakala sumakka channel videos,Suma Kanakala shows,Suma Kanakala etv,Suma Kanakala etv show,Suma Kanakala videos,telugu cinema,Suma Kanakala collage,Suma Kanakala school,Suma Kanakala childhood,సుమ,సుమ కనకాల,సుమ కనకాల స్కూల్,సుమ కనకాల కాలేజ్,సుమ కనకాల సినిమాలు,సుమ కనకాల యూ ట్యూబ్ ఛానెల్,సుమక్క ఛానెల్
తెలుగు యాంకర్ సుమ కనకాల

ఇప్పుడు కూడా ఇలాంటి వీడియో ఒకటి షూట్ చేసి పెట్టింది సుమ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఒక్కరోజులోనే 2 లక్షలకు పైగా వ్యూస్ అందుకుంది. అందులో తన చిన్ననాటి విషయాలను చెప్పింది సుమ. ముఖ్యంగా తాను పెరిగిన ఏరియాతో పాటు అప్పుడు ఫాలో అయిన పద్దతులు.. చిన్నప్పటి స్నేహితులు.. తిరిగిన ప్రదేశాలు ఇలా అన్నీ ఈ వీడియోలో చూపించింది సుమ. లాలాపేట్‌లోని రైల్వే క్వార్టర్స్‌లో సుమ చిన్నతనం గడిచింది. అక్కడే తను ఉన్న ఇంటిని.. తాను డాన్స్ నేర్చుకున్న ప్లేస్ వీడియోలో పోస్ట్ చేసింది ఈ టాప్ యాంకర్.

అక్కడ్నుంచి తను చదువుకున్న సెయింట్ ఆన్స్ స్కూల్.. ఇంటర్మీడియట్ చేసిన రైల్వే జూనియర్ కళాశాలకు వెళ్లి అక్కడ లెక్చరర్స్‌ను కూడా ఆప్యాయంగా పలకరించింది ఈమె. తను కూర్చున్న బెంచులు.. చేసిన అల్లరి.. ఇచ్చిన డాన్స్ పర్ఫార్మెన్సులు.. వచ్చిన మార్కులు అన్నీ పంచుకుంది సుమ. ఇంటర్లో తాను బైపీసీ చేసినట్లు చెప్పింది ఈమె. పక్కనే ఉన్న రైల్వే డిగ్రీ కాలేజ్‌లో బికాం పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చింది సుమ. అక్కడికి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లింది సుమక్క. మొత్తానికి తన చిన్ననాటి విషయాలతో పాటు ఇంకా చాలా వాటి గురించి ఈ వీడియోలో పోస్ట్ చేసింది సుమ. ప్రస్తుతం సుమక్క ఛానెల్‌లో ఈ వీడియో వైరల్ అయిపోయింది.
Published by:Praveen Kumar Vadla
First published: