హోమ్ /వార్తలు /సినిమా /

Suma Kanakala: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సుమ..

Suma Kanakala: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సుమ..

అప్పుడప్పుడూ సినిమా కార్మికుల కోసం ఆర్థిక సాయం కూడా చేస్తుంది సుమ కనకాల. ఇదంతా ఇలా ఉంటే ఈమె సంపాదన విషయంలో మాత్రం సోషల్ మీడియాలో చాలా వార్తలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏ కార్యక్రమం లేకపోయినా కూడా సుమ మాత్రం బాగానే సంపాదిస్తుంది.

అప్పుడప్పుడూ సినిమా కార్మికుల కోసం ఆర్థిక సాయం కూడా చేస్తుంది సుమ కనకాల. ఇదంతా ఇలా ఉంటే ఈమె సంపాదన విషయంలో మాత్రం సోషల్ మీడియాలో చాలా వార్తలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏ కార్యక్రమం లేకపోయినా కూడా సుమ మాత్రం బాగానే సంపాదిస్తుంది.

Suma Kanakala: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయాలు ఎందుకు.. ప్రతీ ఇంటి మనిషిగా మారిపోయింది ఈమె. సుమ అక్కగా అందరికీ పరిచయమే. 6 నుంచి 60 వరకు..

యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయాలు ఎందుకు.. ప్రతీ ఇంటి మనిషిగా మారిపోయింది ఈమె. సుమ అక్కగా అందరికీ పరిచయమే. 6 నుంచి 60 వరకు కూడా అంతా అక్క అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారు. చందమామ అందరికీ మామ అయినట్లు సుమ కూడా అందరికీ అక్క అయిపోయింది. ఎందుకంటే ఆమె చేసే షోలు కూడా అలాగే ఉంటాయి. ప్రతీ ఇంట్లోనూ కలిసిపోయేలా సుమకు ఇమేజ్ వచ్చేసింది. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై సంచలనాలు సృష్టిస్తున్న సుమ కనకాల ఇప్పుడు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

యాంకర్ సుమ (suma kanakala)
యాంకర్ సుమ (suma kanakala)

ఈ న్యూస్ చెప్పిన తర్వాత అభిమానులు.. మరీ ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ అయితే ఎగిరి గంతేస్తున్నారు. కొన్నాళ్ల కింద ఆగిపోయిన ఓ షో ఇప్పుడు తిరిగి మొదలవ్వబోతుంది. కరోనా కారణంగా చాలా రోజులుగా షూటింగ్స్ లేని యాంకర్స్ అంతా ఇప్పుడు మళ్లీ బిజీ అయిపోయారు. కొన్ని రోజులుగా విరామం లేకుండా షూట్ చేస్తూనే ఉన్నారు.

యాంకర్ సుమ (Suma kanakala/ Twitter)
యాంకర్ సుమ (Suma kanakala/ Twitter)

అన్ని షోలు అడ్వాన్స్ కూడా చేసి పెట్టుకుంటున్నారు. పెరుగుతున్న కరోనా ఉధృతిలో మళ్లీ ఎప్పుడు షూటింగ్స్ ఆపాలంటూ ఆజ్ఞలు వస్తాయో తెలియక దొరికిన టైమ్‌లో వీలైనంత వరకు ఎక్కువ ఫుటేజ్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. సుమ కూడా వాళ్లకు సహకరిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియో చేసింది సుమ. అందులో మీ ఫేవరేట్ షో మళ్లీ మొదలు కాబోతుందంటూ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ ఫేవరేట్ షో పేరు అయితే చెప్పలేదు. కానీ అది స్టార్ మహిళ అయ్యుండొచ్చని అంటున్నారు. నిరంతరాయంగా 10 ఏళ్లకు పైగానే వచ్చిన ఈ షో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు సంపాదించుకుంది. ఆ తర్వాత దీన్ని ఆపేసారు. బహుశా ఇదే షో తిరిగి మొదలు పెడుతున్నారేమో అనే అనుమానాలు వస్తున్నాయి. మరి చూడాలిక.. సుమ చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏమై ఉంటుందో..?

First published:

Tags: Anchor suma, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు