హోమ్ /వార్తలు /సినిమా /

అనసూయ అంటే నాకు అసూయ.. యాంకర్ సుమ సంచలనం..

అనసూయ అంటే నాకు అసూయ.. యాంకర్ సుమ సంచలనం..

అనసూయ, సుమ సవాల్ (suma anasuya)

అనసూయ, సుమ సవాల్ (suma anasuya)

Suma Kanakala: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యాంకర్స్‌లో టాప్ ప్లేస్ ఎప్పుడూ సుమ కనకాలదే. ఆమెను క్రాస్ చేసే వాళ్లు ఇప్పట్లో లేరు.. భవిష్యత్తులో కూడా రారు.

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యాంకర్స్‌లో టాప్ ప్లేస్ ఎప్పుడూ సుమ కనకాలదే. ఆమెను క్రాస్ చేసే వాళ్లు ఇప్పట్లో లేరు.. భవిష్యత్తులో కూడా రారు. అంత క్రేజ్ సంపాదించుకుంది ఈ సీనియర్ యాంకర్. సుమ సంపాదిస్తున్న తీరు.. ఆమెకు ఉన్న క్రేజ్ చూసి పక్కా ఇతర యాంకర్స్ బాగా కుళ్లుకుంటారు. ఆమె అంటే అసూయ కూడా పడుతుంటారు. సాధారణంగా సుమను చూస్తుంటే అందరికి కుళ్లు వచ్చేస్తుంటుంది కానీ సుమకు మాత్రం అనసూయను చూస్తే అసూయ వచ్చేస్తుందంట. ఈ విషయం చెప్పింది కూడా ఎవరో కాదు స్వయంగా సుమే.

అనసూయ, సుమ సవాల్ (suma anasuya)
అనసూయ, సుమ సవాల్ (suma anasuya)

ఈ మధ్యే అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన సుమ.. అక్కడ చాలా విషయాలు చెప్పుకొచ్చింది. యాంకరింగ్ మొదలు పెట్టినపుడు అంతా కొత్తగా ఉండేదని.. ఇప్పుడు అంతా అలవాటు అయిపోయిందని చెప్పుకొచ్చింది ఈ కేరళ కుట్టి. మరోవైపు నీకు ఎవర్ని చూస్తే కుళ్లు వస్తుంది.. అసూయ కలుగుతుందని అలీ అడిగితే మరో ఆలోచన లేకుండా.. ఏ మాత్రం బేషజాలకు పోకుండా ఉన్నదున్నట్లు కుండ బద్ధలు కొట్టేసింది సుమ.

యాంకర్ సుమ (Suma kanakala/ Twitter)
యాంకర్ సుమ (Suma kanakala/ Twitter)

తనకు అనసూయను చూస్తుంటే మాత్రం కుళ్లు వచ్చేస్తుందని చెప్పుకొచ్చింది ఈమె. ఆమె హైట్ చూస్తుంటే నిజంగానే కుళ్లు వస్తుందని.. అందం చూస్తుంటే అమ్మాయిగా తనకు ఆ అసూయ అనేది కలుగుతుందని చెప్పుకొచ్చింది. ఒక్క అనసూయను చూసినపుడు మాత్రమే తనకు అలా అనిపిస్తుంది కానీ మిగిలిన ఏ యాంకర్‌ను చూసినపుడు కూడా అలా అనిపించలేదని చెప్పింది సుమ కనకాల.

అనసూయ (Anasuya Bharadwaj/Youtube)
అనసూయ (Anasuya Bharadwaj/Youtube)

ఒకరు మనకంటే ఎక్కువ ఎదుగుతుంటే.. సేమ్ ప్రొఫెషన్‌లో ఉన్నపుడు ఎక్కువ సంపాదిస్తుంటే కచ్చితంగా అసూయ అనేది ఉంటుందని.. దాన్ని దాచిపెట్టలేం కూడా అంటుంది సుమ. తనకు కూడా అనసూయను చూస్తుంటే మాత్రం కుళ్లు వచ్చేస్తుందని చెప్పింది ఈమె. కానీ తామిద్దరం మంచి స్నేహితులం అని.. ఒకరంటే ఒకరికి యిష్టమని చెప్పింది ఈ సీనియర్ యాంకర్. ఏదేమైనా కూడా మనసులో దాచుకోకుండా ఉన్నదున్నట్లు చెప్పడం కూడా సాహసమే.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anasuya Bharadwaj, Anchor suma, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు