సుమ మేనకోడలు అమ్మకు రాసిన లేఖ చదివితే కన్నీరు ఆగవు..

శ్రీలక్ష్మి కనకాల కుటుంబం (Sri Lakshmi kanakala family)

Anchor Suma: రాజీవ్ కనకాల చెల్లి, శ్రీలక్ష్మి క్యాన్సర్‌తో పోరాడుతూ ఏప్రిల్ 6న మరణించింది. దాంతో ఆ ఇంట్లో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. అంతేకాదు.. కరోనా కారణంగా..

  • Share this:
రాజీవ్ కనకాల చెల్లి, శ్రీలక్ష్మి క్యాన్సర్‌తో పోరాడుతూ ఏప్రిల్ 6న మరణించింది. దాంతో ఆ ఇంట్లో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. అంతేకాదు.. కరోనా కారణంగా ఎవర్నీ తమ ఇంటికి రావద్దని రాజీవ్ కనకాల దంపతులే కోరారు. దాంతో అంతా వాళ్లను ఫోన్‌లో పరామర్శించారు కూడా. ఇదిలా ఉంటే చనిపోయిన శ్రీలక్ష్మికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందులో పెద్ద కూతురు ప్రేరణ చనిపోయిన తన అమ్మకు ఓ ఒక ఎమోషనల్ లెటర్ రాసింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాన్ని రాజీవ్ కనకాల కూడా పోస్ట్ చేసాడు. ఇది చదివిన తర్వాత కన్నీరు ఆగడం లేదంటే నమ్మాల్సిందే. అంత ఎమోషనల్‌గా ఈ లేఖను అమ్మకు రాసింది ప్రేరణ. యాంకర్ సుమ కూడా దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

శ్రీలక్ష్మి కనకాల కుటుంబం (Sri Lakshmi kanakala family)
శ్రీలక్ష్మి కనకాల కుటుంబం (Sri Lakshmi kanakala family)


అందులో ఇలా రాసుంది.. "అమ్మ ప్రతి నిమిషం నువ్వు మమ్మల్ని చూస్తూ కాపాడతావని తెలుసు.. నీ చేతి స్పర్శను కూడా నేను ప్రతిరోజు మిస్ అవుతున్నాను.. కానీ నీ ఆశీర్వాదాలు మాత్రం ఎప్పుడూ మాతోనే ఉంటాయి.. మమ్మల్ని ఇలా మధ్యలో విడిచి వెళ్లడం నీకు కూడా చాలా కష్టమని నాకు తెలుసు.. కానీ నువ్వు రైట్ చాయిస్ తీసుకన్నావు.. ఎందుకంటే నువ్వు బాధ పడటం కూడా మేం చూడలేకపోతున్నాం.. నిజంగా నువ్వు మా మధ్య లేవని మాకు అనిపించడం లేదమ్మా.. ఇంట్లో ఉన్న ప్రతి నిమిషం మేము నీ జ్ఞాపకాలను ఫీల్ అవుతూనే ఉంటాం.. నువ్వు వర్క్ నుంచి ఇంటికి వస్తావని.. మా కోసం ఇంట్లో అడుగు పెట్టగానే వెతుకుతూ ఉంటావని ఫీల్ అవుతున్నాం.. ఇంట్లో ప్రతీ మూలలోనూ నీ మ్యాజిక్ ఫీల్ అవుతున్నాను..

శ్రీలక్ష్మి కనకాల కుటుంబం (Sri Lakshmi kanakala family)
శ్రీలక్ష్మి కనకాల కుటుంబం (Sri Lakshmi kanakala family)


నా గుర్తింపు నాకు తెలియక ముందే నేను నీలో భాగమయ్యాను.. మన బంధం శాశ్వతం కాదని నాకు తెలుసు.. నేను చేసే ప్రతి పనిని అక్కడ్నుంచి నువ్వు చూస్తావని నాకు తెలుసు అమ్మా.. ప్రతీ నిమిషం మమ్మల్ని చూస్తూనే ఉంటావని మాకు తెలుసు.. నన్ను, రాగని నువ్వు ఎంత మిస్ అవుతున్నావో నేను ఊహించుకోగలను.. నువ్వు లేవని నిజాన్ని నేను ఇంకా పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నాను.. నువ్వు ఒక కొత్త ప్రపంచాన్ని చాలా త్వరగా ఎంచుకున్నావనేది మేం ఇ:కా డైజిస్ట్ చేసుకోలేకపోతున్నాం.. ఇంటికి రాగానే నిన్ను ఇరిటెట్ చేయడం మిస్ అవుతున్నాను.. నేను తినడం మానేస్తే అప్పుడు నాకు తినిపించడం మిస్ అవుతున్నాను.. నేను, రాగ గొడవ పడితే నువ్వు ఆపడం కూడా మిస్ అవుతున్నాను.. నాకు నీ మీద ఉన్న ప్రేమ చిన్నచిన్న విషయాల్లో చెప్పడం కష్టమే..

నీకు నేను చాలా తక్కువగానే ఐ లవ్ యు చెప్పాను.. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే విషయం కూడా నీకు తెలుసు. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తాను.. ప్రేమిస్తూనే ఉంటాను.. నేను చూసిన వారందరిలో నువ్వు అద్భుతమైన మనిషివి.. నన్ను నువ్వు బాగా అర్థం చేసుకున్నావు.. క్యాన్సర్‌తో ఫైట్ చేయడం అనేది చాలా కష్టం.. కానీ నీ బాధ నాకు కూడా చెప్పకుండా నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో నాకు ఇంకా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. నమ్మకంగా ఎలా ఉండాలో.. ఎవరిపై ఆధారపడకుండా ఎలా ఉండాలో నేర్పావు.. ఇండిపెండెన్స్ అంటే నా కాళ్ళ మీద నేను నిలబడటం అనుకున్నా. కానీ దాంట్లో చాలా బాధ్యతలు ఉంటాయని నాకు తెలిసి రాలేదు.. అమ్మ నేను నిన్ను గర్వంగా ఫీలయ్యేలా చేస్తాను.." అంటూ తన భావాలను చాలా అంటే చాలా ఎమోషనల్‌గా లేఖను రాసింది ప్రేరణ. ఇది చదివిన తర్వాత అంతా ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుంటున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: