Home /News /movies /

ANCHOR SUMA KANAKALA NETIZENS FUNNY COMMENTS ON HER LATEST POST HERE ARE THE DETAILS TA GH

Suma Kanakala: యాంకర్ సుమ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా.. ఇలా కూడా చేస్తారా అంటూ..

యాంకర్ సుమ కనకాల (Instagram/Photo)

యాంకర్ సుమ కనకాల (Instagram/Photo)

Anchor Suma Kanakala: యాంకర్ సుమ కనకాల(Suma) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు. ఆమె జన్మత: మలయాళీ(Malayali) అయినా అచ్చతెలుగులో పొల్లు పోకుండా మాట్లాడగలదు. తాజాగా సుమ కనకాల తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో చూసి అభిమానులు ఇలా కూడా చేయోచ్చ అంటూ ఒకింత ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
Anchor Suma Kanakala: యాంకర్ సుమ కనకాల(Suma) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు. ఆమె జన్మత: మలయాళీ(Malayali) అయినా అచ్చతెలుగులో పొల్లు పోకుండా మాట్లాడగలదు. అంతేకాదు తెలుగులో ఏదైనా పెద్ద సినిమా ఈవెంట్ ఏదైనా ఉంటే.. అక్కడ సుమ మాటల గారడీ ఉండాల్సిందే. అందుకే ఆమెను ఎన్నో షోలకు వ్యాఖ్యాతగా తీసుకుంటారు. ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించే ఏ షో అయినా హిట్ అవ్వాల్సిందే. అంతటి పాపులారిటీ(Popularity) ఉంది కాబట్టే, స్మాల్ స్క్రీన్ పై  (Small Screen)పై కొత్తవారు ఎంత మంది వస్తున్నా సరే సుమ పాపులారిటీ ఏమాత్రం తగ్గడం లేదు. అంతేకాదు సుమ టీవీ తెర సూపర్ స్టార్‌గా రాణిస్తోంది.  తనదైన వాక్చాతుర్యంతో ఎన్నో ఏళ్ల నుంచి టాప్ యాంకర్(Top Anchor)గా కొనసాగుతూ వస్తోంది. తెలుగు స్మాల్ స్క్రీన్ పై  ఎవరికీ సాధ్యం కాని రీతిలో తన స్పాంటేనిటీ పంచులతో ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్(Entertainment) పంచుతుంది.

అందువల్లే, ఏ సినిమా ఈవెంట్ జరిగినా సుమ కనకాల ఉండాల్సిందేనని లక్షల రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఆమెతో యాంకరింగ్ చేయిస్తున్నారు చిత్ర నిర్మాతలు.  ఈటీవిలో వస్తున్న స్టార్ మహిళ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఆడవారిని షోకు పరిచయం చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. తన మాటల ప్రవాహంతో ఒంటి చేత్తో ఈ షోను పాపులర్ చేసింది సుమ. అందుకే స్టార్ మహిళ కార్యక్రమం వేల ఎపిసోడ్లు పూర్తిచేసినందుకు గాను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్(Limka Book of Records)లోకి ఎక్కేసింది. దీనితో పాటు ఈటీవి(ETV)లో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్‌ను కూడా దిగ్విజయంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక లాక్‌డౌన్  (Lockdown) సమయంలో సోషల్ మీడియా(Social Media)లో చాలా యాక్టీవ్‌గా ఉంటూ వస్తున్న సుమ.. తను చేయబోయే  ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది.








View this post on Instagram






A post shared by Suma K (@kanakalasuma)





రీసెంట్‌గా సుమ..  ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) ద్వారా తన అభిమానులతో ఒక ఫన్నీ వీడియోను పంచుకుంది. బ్లూ కలర్ లంగా ఓణీలో అందంగా కనిపించిన ఆమె క్యాష్ ప్రోగ్రామ్(Cash Programme) సెట్ ఫ్లోర్ పై  గిరగిరా తిరుగుతున్న వీడియో(Funny Vedio)ను ఫన్నీ కామెంట్‌తో పోస్ట్ చేసింది. ‘‘ఫ్లోర్‌ను ఎలా ఊడ్చాలనే దానిపై నేడు ఒక కొత్త పద్దతిని కనుగొన్నాను అంటూ ఫన్నీగా చెప్పింది.  మా సెట్లో పనివాళ్లు ఉన్నప్పటికీ, వారికంటే ఇదే వేగంగా ఫ్లోర్‌ను ఊడ్చగలదు..”అంటూ నవ్వుతున్న ఎమోజీ(Emoji)లతో కూడిన పోస్ట్ చేసింది. వైరల్ అయిన ఈ పోస్ట్ను చూసిన కొందరు నెటిజన్లు(netizens) ఏంటి ఇలా కూడా ఫ్లోర్ క్లీన్ చేయొచ్చా... అంటూ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Anchor suma, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు