ఇంట్లో పని మనిషితో కామెడీ చేసిన యాంకర్ సుమ..

యాంకర్ సుమ కనకాల (suma kanakala)

Anchor Suma: లాక్‌డౌన్ సమయంలో సెలబ్రిటీస్‌కు పొద్దు పోక ఏదేదో చేస్తున్నారు. ముఖ్యంగా యాంకర్ సుమ అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంది.

  • Share this:
లాక్‌డౌన్ సమయంలో సెలబ్రిటీస్‌కు పొద్దు పోక ఏదేదో చేస్తున్నారు. ముఖ్యంగా యాంకర్ సుమ అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంది. అప్పుడు బిజీగా ఉన్న రోజుల్లో ఎలా అయితే రోజూ టీవీలో కనిపించేదో.. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది సుమ. ముఖ్యంగా తన సొంత ఛానెల్ సుమక్కలో అయితే రోజుకో వీడియో పెడుతూనే ఉంది. ఇఫ్పుడు కూడా ఇదే చేసింది యాంకర్ సుమ. మే డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపింది. ప్రపంచ కార్మికుల దినోత్సవం రోజు పని చేస్తున్న అందరికీ కూడా తన తరఫు నుంచి విషెస్ చెప్పింది సుమ.

యాంకర్ సుమ (suma kanakala)
యాంకర్ సుమ (suma kanakala)


ముఖ్యంగా పోలీసులు, పారిశుద్ధ కార్మికులతో పాటు అందరికీ ఈ శుభాకాంక్షలు చెప్పింది సుమ. అంతేకాదు జీతం లేకుండా పని చేస్తున్న వాళ్లకు.. అదేనండి ఇంట్లో ఆడవాళ్లకు.. అమ్మలకు.. అక్కలకు.. భార్యలకు అందరికీ కూడా మేడే విషెస్ చెప్పింది సుమ. వాళ్లున్నారు కాబట్టే మనం హాయిగా ఉన్నామని తెలిపింది ఈమె. ఎప్పుడు ఏది అడిగితే అది చేసిపెట్టి.. తమ వాళ్లను సంతోషంగా చూసుకునే అమ్మలు కూడా కార్మికులే అంటుంది యాంకర్.

తన ఇంట్లో కూడా మహి అనే పని మనిషి ఉందని పరిచయం చేసింది సుమ. ఆమె ఉంది కాబట్టే తను షూటింగ్స్ ఉన్నపుడు ఏ టెన్షన్ లేకుండా ఉన్నానని చెప్పింది. ఇప్పుడు లాక్ డౌన్ కావడంతో ఇద్దరం కలిసి పని చేస్తున్నామని చెప్పింది ఈ యాంకర్. అంతేకాదు.. నీ జీతంలో సగం నాకిస్తావా అంటూ కామెడీ కూడా చేసింది ఈమె. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published: