క్రికెట్ ప్రపంచంలో ఎంతమంది గ్రేట్ బ్యాట్స్ మెన్ ఉన్న క్రికెట్ దేవుడు మాత్రం సచిన్ టెండూల్కర్ ఒక్కడే. అలాగే టీవీ ఇండస్ట్రీలో కూడా ఎంత మంది గొప్ప హోస్టులు, యాంకర్స్ ఉన్నా అందరికీ ఆదిగురువు మాత్రం సుమ కనకాలే. ఒకటి రెండు కాదు.. రెండు దశాబ్దాలుగా టెలివిజన్ రంగాన్ని మకుటం లేని మహారాణిగా ఏలేస్తుంది సుమ. రోజుకో కొత్త యాంకర్ వచ్చి.. గ్లామర్ షోలు కూడా చేస్తున్న ఈ సమయంలో ఇంత సుధీర్ఘకాలం కెరీర్ కొనసాగించడం అంటే చిన్న విషయం కాదు. కానీ సుమ మాత్రం చేసి చూపించింది. పాతికేళ్ళుగా ఈమె కెరీర్ సాగుుతంది.. మరో పదేళ్లైనా ఈజీగా ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ యాంకర్‌గా ఉండబోతుంది సుమ.
పైగా తెలుగమ్మాయి కూడా కాదు.. ఎక్కడో కేరళ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు తెలుగమ్మాయిల కంటే స్పష్టంగా మాట్లాడుతుంది సుమ కనకాల. అయితే సుమ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చ నడుస్తూనే ఉంటుంది. ఈమె హీరోయిన్ల కంటే ఎక్కువ సంపాదిస్తుంది.. ఎప్పుడు చూడూ షోస్ చేస్తూనే ఉంటుంది.. ఆమె రెమ్యునరేషన్ లక్షల్లో.. సంపాదన కోట్లలో ఉంటుందని వార్తలు వస్తుంటాయి. దీనిపై ఇప్పుడు ఈమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా క్యాష్ కార్యక్రమంలో యాంకర్ జాఫర్ కూడా వచ్చాడు. అక్కడ ఓ ముఖాముఖి ప్లాన్ చేసాడు జాఫర్.
అందులో సుమ కనకాలను స్ట్రెయిట్ క్వశ్చన్ వేసాడు జాఫర్. మీ భర్త రాజీవ్ కనకాల ఎంత సంపాదిస్తున్నారు.. ఆయన సంపాదన కంటే మీరు ఎక్కువ సంపాదిస్తున్నారంట కదా అంటూ జాఫర్ అడిగిన వెంటనే మరో ఆలోచన లేకుండా పంచ్ వేసింది సుమ. ఈ ప్రశ్న అడిగిన తర్వాత మీకు కింద కామెంట్స్‌లో కొన్ని మాటలు వస్తాయి.. మీకెందుకురా అంటూ ఘాటుగానే పెడతారు అవసరమా అదిప్పుడు అంటూ చెప్పుకొచ్చింది. ఇది విన్న తర్వాత కూడా అక్కడున్న వాళ్లు కూడా నవ్వుకున్నారు. ఏదేమైనా కూడా భర్త రాజీవ్ కంటే కూడా సుమ ఎక్కువ సంపాదిస్తునేది అందరికీ తెలుసు. ఇదే విషయం రాజీవ్ కనకాల కూడా ఒప్పుకున్నాడు.
ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భార్య గురించి ప్రేక్షకులకు తెలియని చాలా విషయాలు చెప్పాడు రాజీవ్ కనకాల. కేవలం సుమ తన ప్రతిభతోనే ఈ స్థాయికి వచ్చిందని.. ఆమె కష్టంలో తాను భాగం తీసుకోనంటున్నాడు రాజీవ్. స్టార్ హీరోయిన్లను మించి సుమ పారితోషికం తీసుకుంటుందని ప్రచారం చేయడంలో అర్థం లేదని చెప్పాడు ఈయన. కాకపోతే లక్షల్లో తీసుకుంటుందంటారు కానీ ఎన్ని లక్షలు తీసుకుంటుందనేది మాత్రం తెలియదు అంటున్నాడు రాజీవ్. పైగా రోజుకు ఎనిమిది గంటలు నిల్చొని.. అన్ని లైట్స్ మధ్యలో షోస్ చేయడం అంటే చిన్న విషయం కాదని.. ఒక్కసారి ఆ కష్టం మీరే ఊహించుకోండి అంటున్నాడు రాజీవ్ కనకాల. రోజూ మీరు స్పీకర్లు ఆన్ చేసేకుంటే తెలియకుండానే మైండ్‌పై ప్రభావం పడుతుంది.. అవన్నీ భరిస్తూ షో చేయడం అంటే గొప్పే కదా అంటున్నాడు ఈయన.
ఇంత చేసినా కూడా మీరు ఊహించుకునేంత రెమ్యునరేషన్ ఏముండదని రాజీవ్ చెప్తుండటం గమనార్హం. మళ్లీ అంతలోనే సుమ రెమ్యునరేషన్ ఎంతో తనకు తెలియదని చెప్పడం వింతగా అనిపిస్తుంది. ఎప్పుడూ తన సంపాదన గురించి అడగలేదని.. ఆమె స్పేస్ ఆమెకే వదిలేస్తానంటున్నాడు రాజీవ్. మొత్తానికి సుమ కనకాల విజయం వెనక మాత్రం ఆమె కష్టం తప్ప మరేం లేదంటున్నాడు ఈయన. భర్తగా తాను చేయాల్సిన సపోర్ట్ చేస్తాను కానీ ఆమె కెరీర్ విషయంలో వేలు పెట్టనంటున్నాడు ఈ నటుడు. ఇక సుమ కూడా తన సంపాదనతో పాటు భర్త సంపాదన గురించి చెప్పమంటే ఇలా స్పందించింది. ఏదేమైనా కూడా ఈ ఇద్దరి మాటలు బాగానే వైరల్ అవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor suma, Telugu Cinema, Tollywood