ANCHOR SUMA KANAKALA COSTLY GIFT TO HER FRIEND SUNITHA FOR HER WEDDING PK
Singer Sunitha - Suma Kanakala: సింగర్ సునీతకు యాంకర్ సుమ కాస్ట్ లీ గిఫ్ట్.. ధర ఎంతో తెలుసా..?
యాంకర్ సుమ సునీత (Anchor Suma Sunitha)
Singer Sunitha - Suma Kanakala: తెలుగు ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు వరసగా మోగుతున్నాయి. గతేడాది మొదలైన బాజాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తాజాగా సింగర్ సునీత వివాహం వివాహం కూడా ఘనంగా జరిగింది. తన మనసుకు నచ్చిన రామ్ వీరపనేనితో..
తెలుగు ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు వరసగా మోగుతున్నాయి. గతేడాది మొదలైన బాజాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తాజాగా సింగర్ సునీత వివాహం వివాహం కూడా ఘనంగా జరిగింది. తన మనసుకు నచ్చిన రామ్ వీరపనేనితో ఏడడుగులు నడిచింది సునీత. రెండో పెళ్లి చేసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేసినా కూడా చాలా మంది మాత్రం సునీత చేసిన పనికి ప్రశంసిస్తున్నారు. ఆమెకు అండగా నిలుస్తున్నారు. అంతేకాదు ఆమెకు తోడుగా స్నేహితులు కూడా నిలిచారు. కొత్త జీవితానికి స్వాగతం పలికారు. పక్కనే ఉండి సునీతకు అండగా నిలిచారు. ఇదిలా ఉంటే సునీత కూడా అచ్చ తెలుగు సంప్రదాయాల ప్రకారం తన పెళ్లి చేసుకుంది. తెలుగు ఇండస్ట్రీలో గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది సునీత. తన గాత్రం, అందంతో వార్తల్లో ఉండే ఈమె ఇప్పుడు పెళ్లితో హాట్ టాపిక్ అయిపోయింది. ఇదిలా ఉంటే సునీత పెళ్లికి చాలా కాస్ట్ లీ గిఫ్టులు వచ్చినట్లు తెలుస్తుంది. అందులో తన స్నేహితురాలు యాంకర్ సుమ కూడా భారీ బహుమతి ఇచ్చింది.
సింగర్ సునీత పెళ్లి వేడుకలు (Singer Sunitha marraige)
లక్షలు ఖరీదు చేసే ఖరీదైన వజ్రాల నెక్లెస్ తన ప్రాణ స్నేహితురాలికి సుమ కానుకగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు పాతికేళ్లుగా సునీత, సుమ స్నేహితులు. అప్పట్నుంచి ప్రాణంగా ఉంటున్నారు. అందుకే సునీత పెళ్లి విషయంలో సుమ ముందు నుంచి కూడా ముందే ఉంది. ప్రీ వెడ్డింగ్ పార్టీ, పెళ్లిలో కూడా హంగామా చేసింది. ఆమెతో పాటు రేణు దేశాయ్ కూడా ఉన్నారు. డిసెంబర్లో సునీత, రామ్ నిశ్చితార్థం జరిగింది.
అంగరంగ వైభవంగా జరిగిన సింగర్ సునీత వివాహాం (Twitter/Photo)
ఇక వీళ్ల పెళ్లి జనవరి 9న శంషాబాద్ సమీపంలో అమ్మపల్లి సీతారామ చంద్రస్వామి ఆలయంలో జరిగింది. ఈ వేడుకకు యాంకర్స్ ఝాన్సీ, సుమతో పాటు చాలా మంది వచ్చారు. నితిన్ కూడా తన భార్యతో సహా వచ్చాడు. మొత్తానికి పెళ్లికి ఎంతమంది వచ్చినా కూడా యాంకర్ సుమ ఇచ్చిన గిఫ్ట్ గురించి మాత్రం చర్చ బాగా జరుగుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.