పులిహోర కలపడం అంటే రెండు రకాలుంటాయి. తినే పులిహోర ఒకటైతే.. మరొకటి కూడా ఉంటుంది. అదేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయిల దగ్గర అబ్బాయిలు.. అప్పుడప్పుడూ సీన్ రివర్స్ అయి అబ్బాయిలతో అమ్మాయిలు కూడా పులిహోర కలుపుతుంటారు. అయితే ఇప్పుడు సుమ మాత్రం నిజంగానే పులిహోర కలిపేసింది. సినిమాలు లేవు.. షూటింగ్స్ లేవు.. దాంతో ఇంట్లోనే ఉండి హాయిగా ఇంటి పనులు చేసుకుంటున్నారు మన స్టార్స్ అంతా. ముఖ్యంగా శ్రీ రామనవమి కావడంతో పిండివంటలు కూడా చేసుకుంటున్నారు.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుమ కనకాల కూడా తన పనులన్నీ అభిమానులతో పంచుకుంటుంది. రామనవమి కానుకగా నోరూరించే పులిహోరను కూడా కలిపేసింది ఈమె. సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ చూసి దాన్ని క్యాష్ చేసుకోడానికి సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్ కూడా పెట్టి అందులోనూ తన లైఫ్ విశేషాలతో పాటు అన్నీ చెబుతుంది సుమ కనకాల. దాంతో పాటు సుమక్క అనే ప్రోగ్రామ్ కూడా మొదలుపెట్టింది ఈమె. అంతేకాదు.. షూటింగ్స్ లేనపుడు తానేం చేస్తాననే విషయంపై కూడా క్లారిటీ ఇస్తుంది సుమ.
ఇప్పుడు కూడా శ్రీ రామనవమి సందర్భంగా ఇంట్లోనే పూజ చేసి పులిహోర కలుపుతుంది సుమ. ఇదే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. అంతటితో ఆగకుండా పులిహోర కలుపుతున్నా.. వస్తారా అంటూ అడిగేసింది. వచ్చేద్దామనే.. నో వే అంతా ఇంట్లోనే ఉండండి.. క్షేమంగా ఉండండి అంటూ అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపింది సుమ. ప్రస్తుతం ఈ పులిహోర వీడియో బాగానే వైరల్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor suma, Telugu Cinema, Tollywood