యాంకర్ సుమ.. యాంకరింగ్‌లో కొత్త ఒరవడి సృష్టించింది. తనదైన మేనరిజంతో యాంకరింగ్‌కు చేస్తూ అప్పటికప్పుడు సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ యాంకరింగ్‌లో తనకు సాటి లేదని నిరూపించుకుంది. ఓ రకంగా టీవీ మెగాస్టార్ అని సుమను అనోచ్చు. దశాబ్ధాలుగా సుమ టీవీ తెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. వయసు 40 దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో ఆమెను అందుకునే శక్తి కానీ.. దాటే అర్హత కానీ, ఆ హుషారు కానీ ఎవరికీ కనిపించడం లేదు. కనీసం సుమ దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించడం లేదు. పెద్ద హీరోలకు సంబంధించిన ఏ ఈవెంట్ అయినా.. సరే తన మాటలతో మాయ చేయడం సుమ స్పెషాలిటీ. తెలుగువారు ఆమెను ఓ యాంకర్‌గా కాకుండా తమ ఇంటి సభ్యరాలిగానే భావిస్తారు. అంతలా తెలుగు వారికి కనెక్ట్ అయిపోయింది ఈ మలయాళీ కుట్టి. తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ఫేస్ బుక్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తాను పెంచుకుంటున్న కుక్క పిల్లకు పుట్టిన రోజు వేడుక చేసింది. కుక్క పిల్లతో కేకు కట్ చేయించిన సుమ.. దానికి కేకు తినిపించింది.
గతంలో కూడా సుమ కుక్కపిల్లతో రాములా అంటూ అదిరిపోయే స్టెప్పులు వేస్తూ వీడియో పోస్ట్ చేసింది. ఇద్దరూ కలిసి ఆ వీడియోలో రచ్చ రచ్చ చేసారు. ఇక లాక్డౌన్లో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడంతో సుమ ప్రస్తుతం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వివిధ కార్యక్రమాలకు చెందిన షూటింగ్స్‌లలో పాల్గొంటోంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.