యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ బిగ్ స్టార్. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ సినిమాతో తెరంగేట్రం చేసిన సుమ.. ఆ తర్వాత సినిమాల్లో కథానాయికగా రాణించలేకపోయినా.. టీవీల్లో మాత్రం స్టార్ అయింది. తెలుగులో టాప్ యాంకర్‌గా ఎవరకీ అందనంత ఎత్తులో ఉంది. సినిమా ఫంక్షనైనా.. టీవీ షో అయినా.. సుమ కనకాల ఉంటే నిర్వాహకులు కాస్తంత రిలాక్స్ అయిపోతారు. ఎంత పెద్ద షో ఐనా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకోవడం సుమ టాలెంట్‌కు నిదర్శనం. జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తోంది. ఈమె వివిధ టెలివిజన్ చానెల్స్‌లో పలు రియాల్టీ షోలతో ముఖ్యంగా మహిళ ప్రేక్షకుల ఆదరణ పొందింది.
స్టార్ మా మహిళ ప్రోగ్రామ్ పున: ప్రారంభం (Twitter/Photo)
సుమ షో ఉంటే చాలు.. ఇంట్లో ఆడవాళ్లు అన్ని పనులు విడిచి పెట్టి టీవీ ముందు కూర్చొని కాస్తంత రిలాక్స్ అవుతారు. తెలుగు వాళ్లకు సుమ వాళ్ల ఇంట్లో సభ్యురాలిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇక ఈమె తెలుగులో ఓ పాపులర్ టీవీ ఛానెల్లో చేసే స్టార్ మహిళ ప్రోగ్రామ్ ఎంతో పాపులర్ అయింది. ప్రతి రోజు మధ్యాహ్నం అయిందంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్లు అన్ని పనులు విడిచిపెట్టి టీవీ ముందు వాలిపోవాల్సిందే. అంతలా ఆ షోతో మహిళల ఆదరణ పొందింది సుమ. దాదాపు వెయ్యి పైగా ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ షోను ఇపుడు సరికొత్త ప్రసారం చేయనున్నారు. మల్లెమాల వాళ్లు ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. మొత్తంగా స్టార్ మహిళ ప్రోగ్రామ్‌తో మరోసారి మహిళ ప్రేక్షకులు మదిని దోచుకోవడానికి సుమ ఆడియన్స్ ముందుకు రాబోతుందన్న మాట.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.