టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమకు పెను ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పింది. సుమ కీ రోల్ ప్లే చేసిన జయమ్మ పంచాయతీ సినిమా గురించి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సుమ ప్రమదానికి గురైంది. జయమ్మ పంచాయతీ కోసం సుమ ఓ అడవిలో వెళ్లాల్సి ఉంది. అయితే అక్కడ చిన్న కాలువలా నీరు ప్రవహిస్తుండగా... రాళ్లు కూడా ఉన్నాయి. ఆ రాళ్లకు బాగా నాచు పట్టి ఉంది. అయితే అక్కడ నిల్చున్న సుమ కాలు ఒక్కసారిగా స్లిప్ అయ్యింది. అయితే వెంటనే సుమ కింద పడిపోయింది. వెంటనే తనను తాను కంట్రోల్ చేసుకోవడంతో ... మరింత కిందకు జారకుండా బయటకు వచ్చేసింది. అయితే సుమనే స్వయంగా తన ఇన్‌స్టా అకౌంట్లో వీడియో పోస్టు చేసింది. తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సుమ పెట్టిన ఈ పోస్టుపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘జాగ్రత్త సుమక్క.. మీకేమైనా అయితే ప్రీరిలీజ్ ఈవెంట్స్, ప్రొడక్షన్స్ టీమ్స్‌కి.. టోటల్‌గా ఎంటర్టైన్మెంట్కే ఇబ్బంది’. అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక జయమ్మ పంచాయితీ సినిమా విషయాకొస్తే.. శ్రీకాకుళం నేపథ్యంలో సాగే ఓ గ్రామీణ కథ ఇది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. మే 6న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
మరోవైపు జయమ్మ పంచాయతీ టీం... సెలబ్రేషన్స్‌లో మునిగి తేలుతున్నారు. జయమ్మ పంచాయతీ పేరుతో స్వీట్ బాక్సులు కూడా రెడీ చేసుకున్నారు. స్వీట్స్ తిని సెలబ్రేషన్స్ చేస్తున్న వీడియోను కూడా సుమ సోషల్ మీడియలో పోస్టు చేసింది. అటు జయమ్మ పంచాయతీ సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకోవడంతో.. ఆ టీం అంతా సుమ ఇంటి దగ్గర టపాసులు కాల్చుతూ... సందడి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor suma, Suma Kanakala