హోమ్ /వార్తలు /సినిమా /

Vishwak Sen:విశ్వక్ సేన్‌పై సుమ సెటైర్లు.. అలా అనేసిందేంటి..!

Vishwak Sen:విశ్వక్ సేన్‌పై సుమ సెటైర్లు.. అలా అనేసిందేంటి..!

విశ్వక్ సేన్

విశ్వక్ సేన్

విరాట పర్వం టీం క్యాష్ ప్రొగ్రామ్‌లో సందడి చేసింది. ఈసందర్భంగా నవీన్ చంద్రతో మాట్లాడుతూ.. సుమ పరోక్షంగా విశ్వక్ సేన్ పై సెటైర్లు వేసేసింది.

యాంకర్ సుమ(Suma).. ఈ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అటు బుల్లితెర ప్రేక్షకులకు.. ఇటు వెండితెర ప్రేక్షకులకు సుమ పేరు సుపరిచితం. టీవీలో ఏ షో యాంకర్ చేయాలన్న సుమనే.. అటు..వెండితెర సినిమలకు సక్సెస్ మీట్లు, ప్రి రిలీజ్ ఈవెంట్ అంటే సుమ రావాల్సిందే. యాంకరింగ్ చేయాల్సిందే. అంతలా ఇండస్ట్రీలో పాతుకు పోయింది సుమ.తన మాటలతో ఎవరిపై అయిన ఈజీగా సెటైర్లు వేసేస్తోంది. ఆ నోటికి తాళం వేయలేమంటే అతిశయోక్తి కాదు. అంతలా అందర్నీ ఆడేసుకుంటుంది సుమ.

అయితే సుమ తాజాగా చేసిన షోలో హీరో విశ్వక్ సేన్ గురించి పరోక్షంగా పంచులు వేసేసింది. ప్రముఖ ఛానల్‌లో క్యాష్ అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వారం క్యాష్ లేటెస్ట్ ప్రొమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ సారి క్యాష్ ప్రొగ్రామ్‌కు విరాట పర్వం (Virata Parvam) సినిమా టీం విచ్చేశారు. రిలీజ్ కి సిద్ధి విరాట పర్వం. ఈ సినిమాలో సాయి పల్లవి, రానా హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రియమణి, యంగ్ హీరో నవీన్ చంద్ర ప్రముఖ పాత్రాల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది విరాటపర్వం టీం.

తాజాగా సాయిపల్లవి, విరాటపర్వం డైరెక్టర్, హీరో నవీన్ చంద్ర క్యాష్ ప్రొగ్రామ్‌లో ప్రత్యక్షమయ్యారు.దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. అయితే ఇందులో నవీన్ చంద్ర డాన్స్ చేస్తూ అలరించాడు.అయితే నవీన్‌కు చిన్న పెట్రోల్ బాటిల్ ఇచ్చింది సుమ. మీరు ఫైర్ అని సింబాలిక్‌గా మీకు పెట్రోల్ ఇచ్చాం అంటూ సుమ అంటారు. దీనికి నవీన్ బదులిస్తూ... దీన్ని తాగితే.. ఇంకా స్పీడుగా పరిగెడతా అంటూ నవీన్ అనగానే.. వద్దు వద్దు...‘ఒకరు ఏదో చేస్తూనే సెన్సేషన్ అయ్యింది. మీరు ఆ పెట్రోల్‌తో ఏం చేయోద్దు బాబు’ అంటూ నవీన్‌తో అన్నారు సుమ.

అయితే సుమ చేసిన కామెంట్స్ మాత్రం విశ్వక్ సేన్‌ను ఉద్దేశించి అనే తెలుస్తోంది. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ల కోసం విశ్వక్ సేన్... ఓ ప్రాంక్ వీడియో చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ వీడియోపై పలువురు అభ్యంతరాలు తెలపడం.. ఆ డిస్కషన్ కాస్త స్టూడియోకు వెళ్లడం.. ప్రముఖ ఛానల్ యాంకర్ విశ్వక్ సేన్‌ను గెట్ అవుట్ అనడం ఇలా వరుసగా సెన్సేషన్లు జరిగిన సంగతి తెలిసిందే.

ఇక క్యాష్ షోకు రానా మినహా ఇతర యూనిట్ సభ్యులు వచ్చారు. సాయి పల్లవి, దర్శకుడు వేణు, నటుడు నవీన్ చంద్ర వచ్చారు. మరి ఈ టీం వచ్చి సందడి చేసిన ఈ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాయి పల్లవి కోసం.. ఈ షో చూస్తామంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

First published:

Tags: Anchor suma, Cash latest promo, Suma Kanakala, Virata Parvam, Vishwak Sen

ఉత్తమ కథలు