హోమ్ /వార్తలు /సినిమా /

Anchor Suma:జబర్దస్త్ షోకు సుమ.. యాంకర్‌ను ఆడేసుకున్న తాగుబోతు రమేష్

Anchor Suma:జబర్దస్త్ షోకు సుమ.. యాంకర్‌ను ఆడేసుకున్న తాగుబోతు రమేష్

Suma Kanakala Instagram

Suma Kanakala Instagram

సుమ వస్తే ఏ షో అయిన ఎంత సందడిగా ఉంటుందో అందరికీ తెలిసిందే.అలాంటి సుమ జబర్దస్త్ షోకు జడ్జీగా వస్తే..ఇక అక్కడ అంతే పంచ్‌లు,సెటైర్లే. తాజాగా సుమ జబర్దస్త్ షోలో హల్ చల్ చేసింది.

జబర్దస్త్ షోకు ఈ వారం జయమ్మ వచ్చింది. జయమ్మ అనుకుంటే ఎవరో అనుకున్నారు.. టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ. సుమ కనకాల ప్రధాన పాత్రగా తెరకెక్కుతున్న సినిమా జయమ్మ పంచాయతీ. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సుమ ప్రమోషన్లలో బిజీగా మారింది. ఈ క్రమంలో ఆమె తెలుగు టీవీ నెంబర్ వన్ షో అయిన జబర్దస్త్‌కు వచ్చింది. కొత్త సినిమా రిలీజ్ ఏదైనా ఉంటే సుమ రావాల్సిందే. సుమ వచ్చిందంటే ఆ ఈవెంట్ ఏదైనా హిట్ అవ్వాల్సిందే. తన మాటలతో అతిథులను, సెలబ్రిటీలను మెస్మెరైజ్ చేస్తూ ఉంటుంది. మాటకు మాట... పంచ్‌కు పంచ్ ఇవ్వడంలో సుమ నెంబర్ వన్. అలాంటి సుమ ఇక జబర్దస్త్‌కు వస్తే ఎలా ఉంటుంది. ఆ సందడి మామూలుగా ఉండదు.

అయితే సుమను అటు జబర్దస్త్ టీం వాళ్లు కూడా మామూలుగా ఆడుకోలేదు. ఇద్దరి మధ్య మంచి పోటా పోటీగా సెటైర్ల పంచ్ జరిగింది. రాకెట్ రాఘవ స్కిట్ చేస్తూ... చిన్నప్పుడు అమ్మ అన్నం తినకపోతే.. స్టార్ యాంకర్ సుమను చూపిస్తూ అన్నం తినిపించేది అంటూ సెటైర్లు వేశాడు.దానికి సుమ కూడా ఏం తగ్గకుండా.. మా అమ్మ కూడా చిన్నప్పుడు రాకెట్ రాఘవ వచ్చేస్తాడు అన్నం తినే అంటూ భయపెట్టేది అంటూ పంచ్‌లు వేసింది. ఇక ఆ తర్వాత సుమపై మరో స్కిట్ వేశారు. ఇందులో తాగుబోతు రమేష్.. సుమ గెటప్‌లో కనిపించాడు. ఇక స్టేజ్‌పై ఒక్కసారిగా అంతా నవ్వుకున్నారు. జడ్జీ ప్లేసులో కూర్చొన్న సుమ సైతం నోనో అంటూ కేకలు వేసింది. ‘తాగుబోతు రమేష్ నా గెటప్ వేసిన కూడా తాగినట్లే ఉందంటూ’ కామెంట్లు చేసింది.

ఇక తాగబోతు రమేష్ సుమ రోల్ ప్లే చేస్తూ.. ఫుల్‌గా ఆడేసుకున్నాడు. ఈవెంట్లతో సుమ ఎంత బిజీగా ఉంటుంది... ఫ్యామిలీ లైఫ్‌ను ఎలా మ్యానేజ్ చేస్తుందన్న అంశంతో సెటైర్లు.. పంచ్ ల మీద పంచ్‌లు వేస్తూ... సుమపై నాన్ స్టాప్ కామెడీతో నవ్వులు కురిపించారు. సుమ నిద్రపోతూ కూడా ఈవెంట్ల గురించి ఆలోచిస్తుందంటూ... తాగుబోతు రమేష్ చేసిన కామెడీ అందర్నీ కడుపబ్బా నవ్వించింది. ఇక సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్లు చేసినప్పుడు.. యాంకర్ సుమ.. హీరో హీరోయిన్లను ఎలా ఆడేసుకుంటుందో కూడా.. తాగుబోతు రమేష్ తనదైన స్టైల్లో సుమ వరుసగా సెటైర్లు వేసేశాడు. ఇక సుమ కూడా ఎక్కడ తగ్గకుండా.. తాగుబోతు రమేష్‌పై ఛాన్స్ దొరికినప్పుడల్లా పంచ్‌లు వేసేసింది. మొత్తం మీద ఈ స్కిట్‌ను సుమ కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేసింది.

First published:

Tags: Anchor suma, Extra jabardasth, Jabardast, Jabardasth comedy show, Suma Kanakala