యాంకర్ సుమ విడాకులు తీసుకుందని ఈ మధ్య కాలంలో ఓ వార్త అయితే బాగా పాపులర్ అయింది. దీనిపై ఇప్పటి వరకు ఆమె కానీ.. సుమ భర్త రాజీవ్ కనకాల కూడా ఏం స్పందించలేదు. చివరికి రాజీవ్ చెల్లి చనిపోయినపుడు కూడా ఇద్దరూ కలిసి కనిపించిన ఫోటోలు కూడా బయటికి రాలేదు. ఇదిలా ఉంటే లాక్‌డౌన్ సందర్భంగా ప్రస్తుతం త్రో బ్యాక్ వీడియోస్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని హల్‌చల్ చేస్తున్నాయి. అందులో సుమ, రాజీవ్ వీడియో కూడా ఒకటి ఉంది. ఒకప్పుడు కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చారు.. ఒకరిపై ఒకరు జోకులు వేసుకున్నారు. ముఖ్యంగా తాను హోస్ట్ చేసిన కార్యక్రమాలకు కూడా భర్త రాజీవ్ కనకాలను తీసుకొచ్చింది సుమ.
అందులో క్యాష్, జీన్స్ లాంటి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. వాటిలో తన భర్తపై మంచి సెటైర్లు కూడా వేసేది సుమ కనకాల. కానీ ఈ మధ్య అలా కనిపించడం లేదు. ఈ ఇద్దరి మధ్య ఏదో జరిగిందనే వార్తలు వినిపిస్తున్న వేళ.. ఇలా ఉండటం కూడా అభిమానులకు లేనిపోని అనుమానాలొచ్చేలా చేస్తుంది. ఆ మధ్య ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ వేడుకలో కూడా రాజీవ్ కనకాలపై ఎలాంటి సెటైర్లు వేయలేదు సుమ. ఇవన్నీ పక్కనబెడితే గతంలో ఈ ఇద్దరూ కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమకి వచ్చే లవ్ లెటర్స్‌తో పాటు పెళ్లి ప్రపోజల్స్‌పై కూడా ఆమె భర్త రాజీవ్ కనకాల మాట్లాడాడు.
పక్కనే సుమ ఉన్నా కూడా తన గురించి చెప్పుకొచ్చాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమకు బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారని.. ఇప్పటికీ ఆమెకు ఐ లవ్ యూ.. పెళ్లి చేసుకుంటానంటూ చాలా మెసేజ్‌లు పెడుతుంటారంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు రాజీవ్. ఇప్పుడు కూడా ఊ అంటే పెళ్లి చేసుకుంటా.. రాజీవ్ నువ్ లక్కీ అంటూ తనకు కూడా మెసేజ్‌లు పెడుతుంటారని చెప్పాడు ఈయన.
వాటి సంగతి నాకు తెలియదు కానీ తనకు మాత్రం పిల్లోడు అన్నం తినడం లేదు.. ఒకసారి మిమ్మల్ని చూపించమన్నాడు.. మా అత్తగారికి చాలా సీరియస్‌గా ఉంది లాంటి వింత మెసేజ్‌లు వస్తుంటాయని చెప్పాడు. ఈ వీడియో ఇప్పటిది కాకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం బాగానే వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా విడిపోయారని వార్తలు వస్తున్న వేళ ఈ వీడియోకు మరింత క్రేజ్ వచ్చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor suma, Telugu Cinema, Tollywood