అభిమానులతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్న యాంకర్ సుమ..

యాంకర్ సుమ Photo : Facebook

తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ తాజాగా లైవ్ వీడియోలో అభిమానులతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది.

  • Share this:
    యాంకర్ సుమ.. సినిమాల్లో చిరంజీవి తన డ్యాన్స్‌లతో, నటనతో తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో.. టీవీల్లో కూడా సుమ తన దైన స్టైల్లో యాంకరింగ్‌కు చేస్తూ అప్పటికప్పుడు సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ అంత పేరు తెచ్చుకుంది. ఓ రకంగా టీవీ మెగాస్టార్ అని సుమను అనోచ్చు. దశాబ్ధాలుగా సుమ టీవీ తెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. వయసు 40 దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో ఆమెను అందుకునే శక్తి కానీ.. దాటే అర్హత కానీ ఎవరికీ కనిపించడం లేదు. కనీసం సుమ దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించడం లేదు. పెద్ద హీరోలకు సంబంధించిన ఏ ఈవెంట్‌ అయినా.. సరే తన మాటలతో మాయ చేయడం సుమ స్పెషాలిటీ. తెలుగువారు ఆమెను ఓ యాంకర్‌గా కాకుండా తమ ఇంటి సభ్యరాలిగానే భావిస్తారు. అంతలా తెలుగు వారికి కనెక్ట్ అయిపోయింది ఈ మలయాళీ కుట్టి. తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ తాజాగా లైవ్ వీడియోలో అభిమానులతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి ఆహారం అందించడానికి అక్షయ పాత్ర తరఫున యాంకర్ సుమ విరాళాలు సేకరిస్తోంది. అందులో భాగంగా రూ.5 లక్షల విరాళాలు సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్న సుమ.. ఇప్పటివరకు రూ.3,91,000 మొత్తాన్ని సేకరించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చిన సుమ.. 307 మంది ఈ విరాళాలు ఇచ్చారని.. తాను ఇచ్చిన పిలుపుపట్ల ఇంతమంది స్పందించి విరాళాలు ఇచ్చినందుకుగానూ థ్యాంక్స్ తెలిపుతూ.. విరాళాల కోసం తాను ఇచ్చిన పిలుపునకు అభిమానులు బాగా స్పందించారంటూ కన్నీరు పెట్టుకుంది. ఈ కష్టకాలంలో తాము మాత్రమే బాగుండాలని అనుకోకుండా తోటి మనుషుల ఆకలిని తీర్చాడానికి ముందుకొచ్చిన వారిని ప్రశంసిస్తూ.. మానవత్వం ఇంకా బతికే ఉందని.. ఇదే దానికి నిదర్శనం అంటూ ఆమె భావోద్వేగానికి గురైంది.
    Published by:Suresh Rachamalla
    First published: