పుష్పలో సుమ కనకాల.. జబర్దస్త్ పాత్రలో స్టార్ యాంకర్..

యాంకర్ సుమ కనకాల (suma kanakala)

యాంకర్ సుమకి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్నేళ్లు అవుతున్నా ఎంతో మంది కుర్ర.. హాట్ యాంకర్ల పోటీ తట్టుకుని మరీ నెంబర్ వన్ పొజిషన్‌లో కొనసాగుతోంది.

  • Share this:
    యాంకర్ సుమ.. సినిమాల్లో చిరంజీవి తన డ్యాన్స్‌లతో, నటనతో తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో.. టీవీల్లో కూడా సుమ తన దైన స్టైల్లో యాంకరింగ్‌కు చేస్తూ అప్పటికప్పుడు సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ అంత పేరు తెచ్చుకుంది. ఓ రకంగా టీవీ మెగాస్టార్ అని సుమను అనోచ్చు. దశాబ్ధాలుగా సుమ టీవీ తెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. వయస్సు 40 దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో ఆమెను అందుకునే శక్తి కానీ.. దాటే అర్హత కానీ ఎవరికీ కనిపించడం లేదు. కనీసం సుమ దరిదాపుల్లో కూడా ఎవరూ కనిపించడం లేదు. పెద్ద హీరోలకు సంబంధించిన ఏ ఈవెంట్‌ అయినా.. సరే తన మాటలతో మాయ చేయడం సుమ స్పెషాలిటీ. తెలుగువారు ఆమెను ఓ యాంకర్‌గా కాకుండా తమ ఇంటి సభ్యరాలిగానే భావిస్తారు. అంతలా తెలుగు వారికి కనెక్ట్ అయిపోయింది ఈ మలయాళీ కుట్టి. తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ సినిమాల మీద దృష్టి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. స్టార్‌ హీరోల సినిమాల్లో ఆమె కీలక పాత్రలు చెయ్యాలని భావిస్తోందట. ఈ తరుణంలోనే ఆమె అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి అక్కగా నటించే అవకాశం ఉందని తాజా సమాచారం. అందులో భాగంగా ఆమె ఇప్పటికే దీనికి సంబంధించి ఒప్పందం కూడా చేసుకుంది అని వార్తలు వస్తున్నాయి. రంగస్థలం సినిమాలో అనసూయ చేసిన పాత్ర ఆమె కెరీర్ లోనే మర్చిపోలేని పాత్రగా మిగిలింది. ఇప్పుడు పుష్ప సినిమాలోనూ సుమకు అదే తరహా పాత్రను డిజైన్ చేశారని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబందించిన ఓ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.
    Published by:Suresh Rachamalla
    First published: