హోమ్ /వార్తలు /సినిమా /

Anchor Suma: సీరియల్ నటిని ఘోరంగా అవమానించిన యాంకర్ సుమ.. వైరల్ వీడియో!

Anchor Suma: సీరియల్ నటిని ఘోరంగా అవమానించిన యాంకర్ సుమ.. వైరల్ వీడియో!

Anchor Suma, Tejaswini

Anchor Suma, Tejaswini

Anchor Suma: బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల పరిచయం గురించి ఎంత చెప్పినా తక్కువే. యాంకరింగ్ తో ఎంతో సందడి చేస్తూ తన మాటలతో బాగా ఆకట్టుకుంటుంది.

  Anchor Suma: బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల పరిచయం గురించి ఎంత చెప్పినా తక్కువే. యాంకరింగ్ తో ఎంతో సందడి చేస్తూ తన మాటలతో బాగా ఆకట్టుకుంటుంది. వెండితెరపై నటించిన సుమకు అంత క్రేజ్ దక్కలేదు కానీ బుల్లితెరలో మాత్రం ఓ రేంజులో ఎదిగిపోయిందనే చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఎన్నో షోలలో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ఓ ముద్ర వేసుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది సుమ.

  తీరికలేని బిజీ లైఫ్ లో గడుపుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఇప్పటి వరకు తన యాంకరింగ్ విషయంలో కానీ, తన మాటల్లో కానీ ఎటువంటి నెగటివ్ ను తన దరికి రానీయకుండా తనదైన శైలిలో ముందుకు సాగుతుంది. ఇక తన షో కి వచ్చిన సెలబ్రెటీలతో ఎంత సందడి చేస్తుందో చూస్తేనే తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా తన షో కి వచ్చిన నటి పరువు తీసేసింది సుమ.

  సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలు పంచుకునే సుమ తన పర్సనల్ విషయాలు కూడా బాగా షేర్ చేసుకుంటుంది. అంతేకాకుండా తనకు సంబంధించిన ఫన్నీ వీడియోలను, ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది. ఇక తాజాగా తన షో లో జరిగిన ఓ ఫన్నీ విషయాన్ని షేర్ చేసుకుంది. తన యాంకరింగ్ చేసే క్యాష్ ఎపిసోడ్ ఇటీవలే పూర్తికాగా ఇందులో బుల్లితెర సెలబ్రెటీలు గెస్ట్ గా పాల్గొన్నారు. అందులో సుహాసిని, వైష్ణవి, తేజస్విని, మోనిష లు పాల్గొన్నారు. ఇక ఆ సమయంలో వాళ్లకి మెహందీ టాస్క్ ఇవ్వగా అలా సుమ చేతి మీద తేజస్విని మెహందీ వేసింది. దానిని వీడియో ద్వారా అభిమానులకు చూపించింది.

  View this post on Instagram


  A post shared by Suma K (@kanakalasuma)  అందులో తన చేతి మీద అది ఇదే.. ఇది గడ్డి తింటున్న ఆవు అంటా. ఏ కోశానా కూడా అలా అనిపించడం లేదు అంటూ ఆమె పరువు తీసింది సుమ. దీనికి స్పందించిన ఆమె అక్క అని దీర్ఘం తీస్తూ కామెంట్ చేసింది. ఇక నెటిజనులు తేజస్వినికి మెహేంది కూడా పెట్టడం రాదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Anchor suma, Cash program, Tejashwini Gowda

  ఉత్తమ కథలు