యాంకర్ సుమను ఏడిపించిన టాలీవుడ్ స్టార్ హీరో

తెలుగు యాంకర్ సుమ కనకాల (Telugu Anchor Suma Kanakala)

స్టేజ్‌పై సుమ మామయ్యలకు సంబంధించిన ఫోటోలు ప్రదర్శిస్తూ సుమను సర్ ప్రైజ్ చేశారు. దీంతో సుమ షాక్ అయ్యారు.

  • Share this:
    వెంకీ మామ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్‌తో పాటు... భల్లాలదేవుడు రాణా కూడా హాజరయ్యారు. హైదరాబాద్, ఫిల్మ్ నగర్ నందు గల జే ఆర్ సి కన్వెన్షన్ హాల్‌లో ఈ మ్యూజికల్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి యాంకరింగ్ చేసిన సుమను రాణా, వెంకటేష్ ఆటాడుకున్నారు. ఎప్పుడూ హీరోలను హీరోయిన్లను తన మాటల చతురతో  అలరించే సుమను ఈసారి వెంకటేస్ టార్గెట్ చేశారు. స్టేజ్‌పై సుమ మామయ్యలకు సంబంధించిన ఫోటోలు ప్రదర్శిస్తూ సుమను సర్ ప్రైజ్ చేశారు. దీంతో సుమ షాక్ అయ్యారు. తనకు ముగ్గురు కాదు, నలుగురు మేనమామలన్నారు సుమ. మరో మేనమామ ఫోటో వేయలేదన్నారు. దీనికి వెంకటేష్ సుమకు కేరళ భాషలో వెంకీ ఆటాడుకున్నారు. ఫోటు వేయని మామయ్య పేరును ప్రస్తావిస్తూ ఆయనకు కేరళ భాషలోనే సారీ చెప్పారు వెంకీ మామ.

    వెంకీ .. .యాంకర్ సుమపై సెటైర్లు వేస్తుంటే.. పక్కనే ఉన్న నాగచైతన్య, రాణా కూడా నవ్వుతూ ఎంజాయ్ చేశారు. ఎదురుగా కుర్చీలో కూర్చొన్న హీరోయిన్లతో పాటు.. దగ్గుబాటి సురేష్ బాబు కూడా వీళ్ల కామెడీకి కడుపబ్బా నవ్వుకున్నారు.  ఇక వెంకీ మామ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందించారు. లెజెండరీ నిర్మాత రామానాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన వెంకీ మామ విషయంలో నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
    Published by:Sulthana Begum Shaik
    First published: