యాంకర్ సుమ డిమాండ్లు... నిర్మాతల జేబులకు చిల్లు

యాంకర్ సుమ కనకాల (suma kanakala)

సుమ కనకాల తాను హోస్ట్ చేసే సినిమా రిలీజ్ ఫంక్షన్లకు రెమ్యునరేషన్‌తో పాటు దానికి జీఎస్టీ కూడా నిర్మాతల నుంచే వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

  • Share this:
    యాంకర్ సుమ డిమాండ్లకు సినీ నిర్మాతల జేబులకు చిల్లు పడుతున్నట్టు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్‌లో ఏ టాప్ హీరో సినిమా రిలీజ్ ఫంక్షన్ అయినా అక్కడ యాంకరింగ్ సుమ చేయాల్సిందే. ఆమె టాలెంట్ వల్ల ఎంత బిజీగా ఉన్నా కూడా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. దీంతో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా అందినవరకు భారీగానే వసూలు చేస్తోంది. ఒక్కో సినిమా రిలీజ్ ఫంక్షన్‌కు సుమ రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేస్తున్నట్టుచెబుతున్నారు. అయితే, దీంతోపాటు జీఎస్టీ కూడా నిర్మాతల దగ్గరే వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. యాంకర్ సుమ రెమ్యునరేషన్ ఎక్కువ అనుకుంటే.. దానికి జీఎస్టీ కూడా నిర్మాతలే కట్టాలంటే ఎలా అంటున్నారు మరికొందరు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా హోస్ట్ చేసిన ప్రతి సినిమాకు రెమ్యునరేషన్, జీఎస్టీ కూడా వసూలు చేస్తుండడంతో కొందరు నిర్మాతలు సుమను పక్కనపెట్టి యువ యాంకర్ల కోసం వెతుకుతున్నట్టు తెలుస్తోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: