యాంకర్ సుమ... తెలుగు టీవీ, సినిమా ప్రేక్షకులకు ఈ పేరు తెలియకుండా ఉండదు. తన మాటలతో ఎలాంటి వారిని అయినా అట్రాక్ట్ చేసేస్తోంది సుమ. సుమ తెలుగు,మళయాళం,హిందీ, ఇంగ్లీష్ భాషాల్లో నాన్ స్టాప్‌గా మాట్లాడగలదు. పంచ్ వేయాలంటే సుమ తర్వాతే ఎవరైనా, ఏ స్టార్ హీరో ప్రిరిలీజ్ ఈవెంట్ అయినా.. సక్సెస్ మీట్ అయినా... ప్రెస్ మీట్ అయినా.. సరే యాంకర్‌గా సుమ ఉండాల్సిందే.
అయితే ఇటీవలే జయమ్మ పంచాయతీ అనే సినిమాతో వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ మూవీ సుమ ప్రధాన పాత్రగా తెరకెక్కిస్తున్నారు. వచ్చేనెల 19వ తేదీని సుమ జయమ్మ పంచాయతీ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా పలు ప్రమోషన్లలో పాల్గొంటుంది సుమ. తన మూవీని ప్రమోట్ చేసుకుంటుంది. ఈ సందర్భంగా అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన సుమకు అలీ.. తన వ్యక్తిగత జీవితంపై పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. ‘సంవత్సరం క్రితం వరకు నువ్వు రాజీవ్ విడిపోయారని..నువ్వు ఒక ఇంట్లో ఉంటున్నావని... అతను ఒక ఇంట్లో ఉంటున్నారని’ అంటూ అడిగే ప్రశ్న మనకు ప్రోమోలో కనిపిస్తుంది.
దీనికి సుమ సమాధానం ఇస్తూ.. ఇద్దరి మధ్యలో గొడవలు అవ్వటం అనేది వాస్తవమే... ఈ 23 ఏళ్లలో ఎన్ని గొడవలు.. కానీ ఒకటి మత్రం నిజం.. భార్యభర్త విడాకులు తీసుకోవడం అనేది ఈజీనే.. కానీ ఓ తల్లిదండ్రులుగా ఇట్స్ డిఫికల్ట్ అన్నారు. సుమ విషయానికి వస్తే.. సుమ మళయాళి అయినా పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లోనే. సుమ తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న సమయంలో దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్ లో సుమ చేస్తుండగా రాజీవ్ కనకాలతో పరిచయం అయింది.
1999, ఫిబ్రవరి 10న వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. సుమ తండ్రి పి.ఎన్.కుట్టి, తల్లి పి.విమల చాలా సంవత్సరాలుగా సికింద్రాబాద్‌లో ఉంటున్నారు. సుమ తల్లిదండ్రులు చాలాకాలం నుండి హైదరాబాదులో ఉండటంతో సహజంగా తెలుగు భాషమీద పట్టు సాధించింది.చదువులో ఆమె తెలుగు సబ్జెక్టును ఎంచుకోవడంలో, తన తల్లి పాత్ర ఎక్కువగా ఉందని అంటుంది. ప్రముఖ తెలుగు ఛానళ్ల టీవీ షోలలో సుమ హోస్ట్ చేస్తూ వస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor suma, Rajiv Kanakala, Suma Kanakala