Home /News /movies /

రాహుల్ సిప్లిగంజ్‌కు యాంకర్ సుమ సవాల్..

రాహుల్ సిప్లిగంజ్‌కు యాంకర్ సుమ సవాల్..

Instagram

Instagram

తెలుగు ప్రముఖ యాంకర్ సుమ క‌న‌కాల బిగ్ బాస్ తెలుగు 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌కు ఛాలెంజ్ విసిరారు.

  తెలుగు ప్రముఖ యాంకర్ సుమ క‌న‌కాల బిగ్ బాస్ తెలుగు 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌కు ఛాలెంజ్ విసిరారు. ఇంత‌కు ఆమె రాహుల్‌కు ఏ విషయంలో విషయంలో ఛాలెంజ్‌ విసిరారో తెలుసా? గ‌్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కులు నాట‌డానికి. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ పార్లమెంట్ స‌భ్యుడు సంతోష్‌కుమార్ హరితహారంలో భాగంగా ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్య‌మంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు భాగ‌మ‌వుతున్నారు. ఇందులో భాగంగా గ్రీన్ ఛాలెంజ్‌ను మరోకరి నుండి స్వీకరించిన ప్రముఖ నటి జ‌య‌సుధ‌ మొక్కలు నాటి.. సుమ పేరును నామినేట్ చేశారు. దీంతో ఈ స‌వాల్‌ను స్వీక‌రించిన సుమ, బేగంపేట‌లోని మ‌యూరి స్టూడియోలో మూడు మొక్కలు నాటారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు, తెలంగాణ ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ఆతర్వాత ఆమె గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా.. జూనీయర్ ఎన్టీఆర్‌, మంచు ల‌క్ష్మితోపాటు బిగ్‌బాస్ విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌‌కు ద‌ర్శ‌క నిర్మాత ఓంకార్‌ల‌ను నామినేట్ చేస్తూ.. మొక్కలు నాటాలని సవాల్ విసిరారు.
  చిన్న డ్రెస్ వేసుకున్న పెద్ద పాప
  First published:

  Tags: Anchor suma, Rahul sipligunj

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు