Anchor Suma : జబర్దస్త్ కార్తిక్ తల్లి బాధను చూసి.. తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్న యాంకర్ సుమ..

యాంకర్ సుమ Photo : Youtube

Anchor Suma : యాంకర్ సుమ.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. ఎందుకంటే రోజు టీవీల్లో ఏదో ఒక షోలో సుమ కనబడుతుంది.

  • Share this:
    యాంకర్ సుమ.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. ఎందుకంటే రోజు టీవీల్లో ఏదో ఒక షోలో సుమ కనబడుతుంది, వినబడుతుంది. సినిమాల్లో చిరంజీవి తన డ్యాన్స్‌లతో, నటనతో తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో.. టీవీల్లో కూడా సుమ తన దైన స్టైల్లో యాంకరింగ్‌కు చేస్తూ అప్పటికప్పుడు సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ అంత పేరు తెచ్చుకుంది. ఓ రకంగా టీవీ మెగాస్టార్ అని సుమను అనోచ్చు. దీంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దశాబ్ధాలుగా సుమ టీవీ తెరపై అద్భుతాలు చేస్తూనే ఉంది. ఓర్పుతో నేర్పుతో.. వయసు 40 దాటినా కూడా ఇప్పటికీ యాంకరింగ్‌లో అదే హుషారు చూపిస్తుంది. ఇక యాంకరింగ్‌లో.. ఆమెను అందుకునే శక్తి కానీ.. దాటే అర్హత కానీ ఎవరికీ కనిపించడం లేదు. కనీసం సుమ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఇక పెద్ద హీరోలకు సంబంధించిన ఏ ఈవెంట్‌ అయినా.. సుమ యాంకరింగ్ చేయాల్సిందే.. సరే తన మాటలతో మాయ చేయడం సుమ స్పెషాలిటీ. తెలుగువారు ఆమెను ఓ యాంకర్‌గా కాకుండా తమ ఇంటి సభ్యరాలిగానే భావిస్తారు. అంతలా తెలుగు వారికి కనెక్ట్ అయిపోయింది ఈ మలయాళీ కుట్టి. తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ తాజాగా ఓ షోలో కన్నీరు పెట్టుకుంది. వివరాల్లోకి వెళితే..

    ఈ టీవీలో ప్రసారం అయ్యే క్యాష్‌ షోకి జబర్దస్త్ కమెడియన్ కార్తిక్ తన తల్లితో వచ్చాడు. ఈ సందర్భంగా కార్తిక్ తన తల్లి గురించి మాట్లాడుతూ తన తల్లి యోధురాలు అని, రెండు సంవత్సరాల నుంచి 30 కిమోలు, రెండు మేజర్‌ సర్జరీలు చేయించుకుందని తెలిపాడు. తన లాంటి ఎంతోమంది కమెడియన్లు జబర్దస్త్ కు వచ్చాకే కడుపునిండా తింటున్నారని.. ఇళ్లు.. కార్లు కొనుకున్నారని తెలిపాడు. తాను మాత్రం తనకు వచ్చిన డబ్బులతో తన తల్లిని బతికించుకోగలిగానని చెప్పాడు. దీంతో యాంకర్ సుమ భావోద్వేగానికి గురై.. కన్నీరు పెట్టుకుంది. ఈ షోలో కార్తీక్‌తో పాటు వర్షిణి, రవి, భాను కూడా వారి తల్లులతో ఈ షోలో పాల్గోని సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
    Published by:Suresh Rachamalla
    First published: