ప్రముఖ యాంకర్ సుమ.. వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో వరుస సినిమాలు చేసిన సుమ కనకాల.. ఆ తర్వాత మాత్రం టీవీషోలకు మాత్రమే పరిమితం అయ్యింది. గత 15 ఏండ్లుగా తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాంకర్‌గా కొనసాగుతోంది. ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కూడా.. స్టేజ్‌పై హడావుడి అంతా సుమదే. ఈవెంట్ ఏదైనా అందులో సుమ యాంకర్ అయితే చాలు.. ఆ ప్రోగ్రామ్ సూపర్ హిట్. అయితే సుమ రెమ్యునరేషన్ కూడా అలాగే ఉంటుంది. ఒక్కో ఈవెంట్ కోసం కనీసం 3 నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే టీవీలో ఒక్కొక్క ఎపిసోడ్ కోసం కనీసం లక్ష రూపాయలకు పైనే రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
తాజాగా సుమ మరోసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. జయమ్మ పంచాయతీ పేరుతో సుమ వెండితెరపై కనిపించనుంది. సుమ ప్రధాన పాత్రలో వస్తున్న జయమ్మ పంచాయతీ ( Jayamma Panchayathi ) షూటింగ్ పూర్తయింది. ఇందులో టైటిల్ రోల్ చేస్తోంది సుమ. కొత్త దర్శకుడు విజయ్ కుమార్ కొలివరపు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మే 6న ఈ సినిమా రిలీజ్ కానుండటంతో.. సినిమా టీం ప్రమోషన్లలో బిజీగా మారింది. తాజాగా సుమతో పాటు మూవీ టీం అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. జయమ్మ పంచాయతీ సినిమా కథను ప్రముఖ నటి రమ్యకృష్ణ గారి కోసం సిద్దం చేశానన్నారు. రమ్యకృష్ణ గారిని దృష్టిలో పెట్టుకొని ఈ కథ రెడీ చేశానన్నారు. ఈ మాట విని మధ్యలో దూరిన సుమ.. ఇంకా చెప్పండి కుష్బూ, జ్యోతిక ఇలా కొందరు పేర్లు చెప్పండి బావుంటుందంటూ డైరెక్టర్‌తో కామెడీ చేసింది రమ్య. దీంతో అలీ మధ్యలో వచ్చి వారందర్నీ వద్దనుకొని.. చివర్లో సుమ దగ్గరకు వచ్చారా ? అని అనగానే మళ్లీ సుమ కల్పించుకొని ‘అని చెప్పండి’ పర్వాలేదు అంటూ పంచ్‌లు వేస్తోంది.
అయితే డైరెక్టర్ కథ అంతా చెప్పాక.. మీరు చేయగలరా ? అంటూ తనను క్వశ్చన్ చేశారన్నారు. దీంతో ఆ మాట విన్న అలీ.. దీంతో నీకు ఎక్కడో కాలింది అని సుమతో అన్నారు అలీ. అప్పుడు ఖచ్చితంగా ఈ కథ చేసి చూపిస్తా అంటూ సుమ .. డైరెక్టర్‌తో సవాల్ చేసినట్లు ఈ షోలో చూపించారు. మొత్తం మీద రమ్యకృష్ణ లాంటి టాప్ నటి కోసం రాసిన కథలో సుమ నటించడం గొప్ప విషయమే. అయితే మరి ఆ పాత్రకు సుమ ఎంతవరకు న్యాయం చేసిందో తెలియాలంటే... జయమ్మ పంచాయతీ చూడాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor suma, Suma, Suma Kanakala