ANCHOR SRIMUKHI SHOCKED BY HERO NAVADEEP BEHAVIOUR MK
Sree Mukhi: యాంకర్ శ్రీముఖికి ఘోర అవమానం...టాలివుడ్ హీరో అన్న మాటకు...కన్నీళ్లు పెట్టుకొని...షాకింగ్...
యాంకర్ శ్రీముఖి (anchor srimukhi)
ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ చెప్పిన నవదీప్ బుల్లితెరపై చేసే సందడి చేస్తున్నాడు. ప్లేబాయ్ గా పేరుపొందిన నవదీప్ తన మాటలకు హ్యూమర్ యాడ్ చేసి ఈ మధ్య నవ్వులు పూయిస్తున్నాడు.
ఒకప్పటి హీరో నవదీప్ అంటే ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే ఆయనకు అమ్మాయిల నుంచి తెగ ఫ్యాన్స్ ఉంటారు. అయితే ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ చెప్పిన నవదీప్ బుల్లితెరపై చేసే సందడి చేస్తున్నాడు. ప్లేబాయ్ గా పేరుపొందిన నవదీప్ తన మాటలకు హ్యూమర్ యాడ్ చేసి ఈ మధ్య నవ్వులు పూయిస్తున్నాడు. హీరో నుంచి విలన్ వరకూ కారెక్టర్ ఆర్టిస్టు వేషాలతో సహా ఎలాంటి పాత్రనైనా పండించడంలో తన సత్తా చాటిన నవదీప్, టెలివిజన్ తెరపై కూడా తనదైన శైలితో రెచ్చిపోతున్నాడు. తాజాగా అదిరింది షోలో నవదీప్ జడ్జ్‌గా చేసిన నవదీప్ అందులో తన మార్క్ సెటైర్లు, పంచ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో తెగ రచ్చ చేసేశాడు. అక్కడితో ఆగిపోలేదు...ఫెస్టివల్స్ సందర్భంగా స్పెషల్ ఈవెంట్లతో సందడి చేస్తుంటాడు. ఇప్పటికే దసరా ఈవెంట్ కు సంబంధించి ఈటీవీలో నవదీప్ అదరగొట్టేయగా, ఇప్పుడు సంక్రాంతికి జీ తెలుగులో సైతం నవదీప్ అలాగే తన మార్క్ కామెడీని పంచుతున్నాడు. తాజాగా జీతెలుగులో సంక్రాంతి సంబరాలు ఈవెంట్లో హీరో రామ్, నవదీప్ స్పెషల్ గెస్ట్లుగా వచ్చారు. ఇందులో నవదీప్ తెగ రెచ్చిపోయాడు. యాంకర్లను ఓ రేంజ్లో ఆడేసుకున్నాడు. అందులో ప్రధానంగా యాంకర్ శ్రీముఖిపై పంచ్‌ల వర్షం కురిపించాడు. దీంతో ఆమెకు అనుకోని షాక్ తగిలింది. నవదీప్ తో కలిసి పలుమార్లు ఈవెంట్స్ లో పాల్గొన్న శ్రీముఖి ఈ సారి మాత్రం నవదీప్ లో కనిపించిన మార్పుతో మొహం మాడిపోయింది. నవదీప్ వస్తూ వస్తూనే ఎంట్రీలోనే యాంకర్ శ్రీముఖిని ఉద్దేశిస్తూ సెటైర్లు వేశాడు.
అయితే శ్రీముఖి తన సహజ స్టైల్ కు తగ్గట్టుగానే హీరో నవదీప్‌పై ఒరిగిపోయింది. అప్పుడు శ్రీముఖి అమ్మ బాబోయ్ ఇలా కనెక్ట్ అయిపోతున్నానేంటి? అని శ్రీముఖి కౌంటర్ వేసింది. ఇంకెవరైనా అవుతారా? అని చూస్తున్నా నేను అంటూ రివర్స్ కౌంటర్ వేసేశాడు. దీంతో శ్రీముఖి మొఖం మాడిపోయింది. అంతేకాదు నేను అలిగాను, బుంగమూతి పెట్టుకున్నాను అని శ్రీముఖి అనగానే.. బుంగమూతా? బొంగుమూతా? అని నవదీప్ రివర్స్ పంచ్ వేశాడు. లైఫ్‌లో ఎవరైనా మరదళ్లు ఉన్నారా? అని శ్రీముఖి అంటే.. ఓ మరదలు ఉందని నవదీప్ అన్నాడు.. అవునా ఎవరు అని శ్రీముఖి వెరైటీగా అడిగింది. ఇంకెవరు మావయ్య కూతురు అని మళ్లీ ఓ పంచ్ వేయడంతో శ్రీముఖి సైలెంట్ అయిపోయింది. ఇలా నవదీప్ తనలో వచ్చిన మార్పును అందరి ముందు బయటపెట్టేశాడు. ఒకప్పుడు ఎంతో సిగ్గు పడుతూ మొహమాటం ప్రదర్శించే నవదీప్ ఇలా చేంజ్ అవ్వడంతో ఆశ్చర్యపోవడం శ్రీముఖి వంతు అయ్యింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.