ANCHOR SRIMUKHI INTERESTING COMMENTS ON HER MARRIAGE AT CASH PROGRAM SB
నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం మాత్రం అతనే.. శ్రీముఖి కీలక వ్యాఖ్యలు
యాంకర్ శ్రీముఖి
శ్రీముఖి బుల్లితెరపై సక్సెస్ఫుల్ యాంకర్. అయితే కొన్ని రోజులుగా ఆమె షోలకు గ్యాప్ ఇచ్చింది. అయితే ఇటీవలే ఓ ప్రొగ్రాంకు గెస్ట్‌గా వచ్చిన శ్రీముఖి తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పింది.
ప్రస్తుతం బుల్లితెర నటులు, యాంకర్లు కూడా హాట్ టాపిక్‌గా ఉంటున్నారు. అంతేకాదు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ.. కెరీర్‌ను బిల్డప్ చేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ తెలుగు యాంకర్ శ్రీముఖి ఇప్పుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఆమె స్పెషల్ షోలో పాల్గొని... తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. త్వరలో శ్రీరామ నవమి పండగ రానుంది. ఈ సందర్భంగా ప్రముఖ యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న శ్రీరామనవమి స్పెషల్ క్యాష్ ప్రోగ్రాంలో శ్రీముఖి పాల్గొంది. దీనికి సంబంధంచిన ప్రోగ్రాం ప్రోమో తాజాగా విడుదల చేశారు.
తొలిసారి క్యాష్ ప్రోగ్రాంలో తన పర్సనల్ లైఫ్, మ్యారేజ్ గురించి శ్రీముఖి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అది కూడా ఎమోషనల్ గా.. దీనితో శ్రీముఖి మ్యారేజ్ గురించి సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ మొదలయింది. తాను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది. ఎంతో అందమైన హీరోలు, కో యాంకర్స్ తో వర్క్ చేశానని చెప్పింది శ్రీముఖి. కానీ ఎవ్వరికి తన మనసు మాత్రం ఇవ్వలేదన్నారు. పెళ్లి చేసుకోలేదన్నారు. అయితే ఇప్పటికీ తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం మాత్రం ఓ వ్యక్తి అంటూ శ్రీముఖి క్యాష్ షోలో మాట్లాడింది. అయితే ఆ వ్యక్తి పేరు చెప్పే లోపు ప్రోమో ఎండ్ అవుతుంది. దీంతో ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే 9వ తేదీ ప్రసారం అయ్యే క్యాష్ ప్రోగ్రాం చూడాల్సిందే.
అయితే గతంలో శ్రీముఖి ఎవరో అజ్ఞాత వ్యక్తితో ప్రేమ బ్రేకప్ అయినట్టు చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే శ్రీముఖి తన జాతి రత్నాలు టీం తో కలసి క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొంది. నూకరాజు, ఇమ్మాన్యుయేల్, పంచ్ ప్రసాద్ వీరంతా శ్రీరామనవమి క్యాష్ ప్రోగ్రాంలో సందడి చేశారు. టీవీలో కూడా అనేక షోలో, ప్రొగ్రాంలు చేస్తూ శ్రీముఖి బిజీగా మారింది. అటు సినిమాల్లో కూడా నటిస్తోంది శ్రీముఖి. నేను శైలజ సినిమాలో కూడా నటించింది. తాజాగా శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. దర్శకుడు. ఇందులో శ్రీముఖి స్టన్నింగ్ పాత్రలో కనిపించి అలరించనుంది.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.