Sreemukhi: రాత్రి పడుకునే ముందు శ్రీముఖి చెప్పిన 5 బ్యూటీ టిప్స్..

Sreemukhi: అమ్మాయిలకు మేకప్‌పై సాధారణంగానే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎప్పుడూ అందంగా కనిపించాలని.. తమను తాము గ్లామరస్‌గా ఉండాలని కోరుకుంటారు.


Updated: July 21, 2020, 8:53 PM IST
Sreemukhi: రాత్రి పడుకునే ముందు శ్రీముఖి చెప్పిన 5 బ్యూటీ టిప్స్..
యాంకర్ శ్రీముఖి (Photo: Sreemukhi/Instagram)
  • Share this:
అమ్మాయిలకు మేకప్‌పై సాధారణంగానే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎప్పుడూ అందంగా కనిపించాలని.. తమను తాము గ్లామరస్‌గా ఉండాలని కోరుకుంటారు. అందుకే ఎప్పటికప్పుడు కొత్తగా మేకప్ టిప్స్ ఏం వస్తున్నాయని కూడా చెక్ చేస్తుంటారు. తమకు నచ్చిన హీరోయిన్స్‌ను కూడా బ్యూటీ టిప్స్ అడుగుతుంటారు. మేకప్ లేకుండా అందంగా ఎలా కనిపించాలి.. ఎప్పుడు ఎలాంటి మేకప్ వేసుకోవాలి.. ఇంట్లో ఉన్నపుడు ఎలా సిద్ధమవ్వాలి అనేది అడుగుతూ ఉంటారు.

యాంకర్ శ్రీముఖి హాట్ షో (Anchor Sreemukhi/Instagram)
యాంకర్ శ్రీముఖి హాట్ షో (Anchor Sreemukhi/Instagram)


ఇప్పుడు యాంకర్ శ్రీముఖి కూడా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చింది. తాజాగా తన అభిమానుల కోసం బ్యూటీ టిప్స్ ఇచ్చింది శ్రీముఖి. రాత్రి పడుకునే ముందు ఎలాంటి టిప్స్ తీసుకోవాలో చెప్పింది శ్రీముఖి. అందులో 5 స్టెప్స్ కూడా చూపించింది. ముందుగా మేకప్‌తో ఉన్నపుడు ఆయిల్ తీసుకుని మొహానికి లైట్‌గా రాసుకోవడం.. అలా చేసి ముఖంపై ఉన్న మేకప్‌ను మెల్లగా టిష్యూతో తొలగించాలి.

ఆ తర్వాత ఓ క్రీమ్ తీసుకుని మొహమంతా రాసుకోవాలి. అది కూడా నెమ్మదిగానే రాసుకోవాలి. ఆ వెంటనే మరో చిన్న లిక్విడ్ తరహాలో ఉండే క్రీమ్ తీసుకుని మొహంపై అక్కడక్కడా చిన్నచిన్న డ్రాప్స్ వేసుకుని టిష్యూతో తుడుచుకోవాలి. ఆ తర్వాత ఓ క్రీమ్ రాసుకుని మేకప్ పూర్తిగా తీసేయాలి. చివర్లో లిప్ బామ్ రాసుకునిపెదవులను కాపాడుకోవాలి. ఇలా చేస్తే మీ అందం మీతోనే ఉంటుందని చెప్తుంది శ్రీముఖి.
Published by: Praveen Kumar Vadla
First published: July 21, 2020, 8:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading