యాంకర్ శ్రీముఖి మాస్క్ తయారీని చూసి నేర్చుకుందామా..?

Anchor Sreemukhi: ఇప్పుడు సెలబ్రిటీస్.. కామన్ మెన్ అనే తేడా లేకుండా అందరి నోళ్లలోనూ ఒకటే మాట.. అదే కరోనా వైరస్. అందరి మొహాలకు ఒకటే అడ్డు.. అదే మాస్క్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2020, 6:51 PM IST
యాంకర్ శ్రీముఖి మాస్క్ తయారీని చూసి నేర్చుకుందామా..?
యాంకర్ శ్రీముఖి హాట్ షో (Anchor Sreemukhi)
  • Share this:
ఇప్పుడు సెలబ్రిటీస్.. కామన్ మెన్ అనే తేడా లేకుండా అందరి నోళ్లలోనూ ఒకటే మాట.. అదే కరోనా వైరస్. అందరి మొహాలకు ఒకటే అడ్డు.. అదే మాస్క్. ఫేస్ మాస్క్ లేకుండా బయటికి అడుగు కూడా ఎవరూ పెట్టడం లేదు. దాంతో మాస్కుల కరువు కనిపిస్తుంది. కొన్నిచోట్ల ఇప్పటికీ మాస్కులు దొరకడం లేదు. మరికొన్ని చోట్ల ఔట్ ఆఫ్ స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మాస్క్‌ల కోసం అక్కడా ఇక్కడా తిరగడం కాదు.. ఇంట్లోనే ఇది ఎలా తయారు చేసుకోవాలనేది అందరికీ తెలుసుండాలి అంటుంది యాంకర్ శ్రీముఖి.

అసలు మాస్క్ ఎలా తయారు చేసుకోవాలనేది తాను చూపిస్తానని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. అన్నట్లుగానే ఓ గడ్డతో మాస్క్ ఎలా సిద్ధం చేసుకోవాలో వీడియో చేసి మరీ ట్వీట్ చేసింది శ్రీముఖి. ఇది చూసిన తర్వాత అభిమానులు కూడా అమ్మడు చేసిన పనికి ఫిదా అవుతున్నారు. మాస్క్ తయారీ చూపించడమే కాదు.. అది లేకుండా బయటికి వెళ్లొద్దని జాగ్రత్తలు కూడా చెప్పింది శ్రీముఖి. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని.. ఒకవేళ వెళ్లినా కూడా సోషల్ డిస్టేన్సింగ్ మరిచిపోవద్దని చెబుతుంది ఈ భామ.

First published: April 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading