• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ANCHOR SREEMUKHI REACTED OVER CASE FILED ON HER AND SAYS READY TO SAY SORRY PK

శ్రీముఖి రియాక్షన్.. 2018లో ముగిసిన షోపై ఇప్పుడు కేసు ఏంటి..?

శ్రీముఖి రియాక్షన్.. 2018లో ముగిసిన షోపై ఇప్పుడు కేసు ఏంటి..?

యాంకర్ శ్రీముఖి హాట్ షో (Anchor Sreemukhi)

Sreemukhi: యాంకర్ శ్రీముఖిపై కేసు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్రాహ్మణుల మనోభావాలను కించ పరిచారని ఈమెపై కేసు పెట్టాడు ఓ బ్రాహ్మణుడు. దాంతో బంజారా హిల్స్..

  • Share this:
యాంకర్ శ్రీముఖిపై కేసు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్రాహ్మణుల మనోభావాలను కించ పరిచారని ఈమెపై కేసు పెట్టాడు ఓ బ్రాహ్మణుడు. దాంతో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో శ్రీముఖితో పాటు ఆ ప్రోగ్రామ్ ప్రసారం చేసిన ఛానెల్‌పై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈమె ఎప్పుడు ఎక్కడ ఎలా బ్రాహ్మణులను కించపరిచిందనే వివరాల్లోకి వెళ్తే రెండేళ్ల వెనక్కి వెళ్లాలి. జెమినీలో అప్పట్లో జూలకటక అనే షో వచ్చేది. అందులో ఒక ఎపిసోడ్‌లో బ్రాహ్మణుల గౌరవాన్ని తగ్గించేలా అసభ్యకర వ్యాఖ్యలు చేసిందంటూ శ్రీముఖిపై కేసు నమోదైంది. దీనిపై ఇప్పుడు శ్రీముఖి రియాక్ట్ అయింది.
యాంకర్ శ్రీముఖి హాట్ షో (Anchor Sreemukhi)
యాంకర్ శ్రీముఖి హాట్ షో (Anchor Sreemukhi)

తనకు ఏ వర్గాన్ని కించపరిచే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది. సమాజంలో అన్ని వర్గాలకు తాను సమాన గౌరవం ఇస్తానని చెప్పింది శ్రీముఖి. తనపై నమోదైన కేసు చూసి షాక్ అయ్యానని చెబుతుంది శ్రీముఖి. ఈ విషయంలో పోలీసులకు అన్ని విధాల సహకరించడానికి తాను సిద్ధంగానే ఉన్నానని చెప్పింది ఈమె. ఈ వివాదానికి ముగింపు పలకాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది శ్రీముఖి. అయితే రెండేళ్ల కింద ఆగిపోయిన షోలో ఎపిసోడ్ చూసి ఇప్పుడు కేసు వేయడం ఏమిటో తనకు అర్థం కాలేదని ఆమె ఆశ్చర్యపోయింది.
యాంకర్ శ్రీముఖి హాట్ షో (Anchor Sreemukhi)
యాంకర్ శ్రీముఖి హాట్ షో (Anchor Sreemukhi)

2018లోనే ఆ షో ముగిసిందని.. తొలిసారి ప్రసారం అయినప్పుడు కంటెంట్ మీద ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని తెలిపింది. ఇప్పుడు ఎవరు ఎందుకు కేసు వేశారో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది శ్రీముఖి. లాక్‌డౌన్ సమయంలో కొన్ని షోలు పున:ప్రసారం అవుతున్నాయి. అలా ఇప్పుడు ఈ షో చూసి కేసు వేసారేమో మరి అనే ప్రచారం జరుగుతుంది. ఆ షోలో ఏ వీడియో క్లిప్ మీద వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో తనకు తెలియదని చెప్పుకొచ్చింది ఈమె. తెలిసో తెలియకో తాను తప్పు చేసి ఉంటే క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని శ్రీముఖి తెలిపింది.
Published by:Praveen Kumar Vadla
First published: