• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ANCHOR SREEMUKHI MESMERIZED WITH HER NEW TALENT AND HERE THE FULL STORY PK

Anchor Sreemukhi: యాంకర్ శ్రీముఖి టాలెంట్‌కు అంతా ఫిదా.. అమ్మో మామూలు పిల్ల కాదు..

Anchor Sreemukhi: యాంకర్ శ్రీముఖి టాలెంట్‌కు అంతా ఫిదా.. అమ్మో మామూలు పిల్ల కాదు..

యాంకర్ శ్రీముఖి (Twitter/Photo)

Anchor Sreemukhi: ఇప్పటి వరకు శ్రీముఖి అంటే కేవలం యాంకర్‌గా మాత్రమే తెలుసు. కానీ ఈమెలో యాంకర్ మాత్రమే కాదు ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయి. అవసరం వచ్చినపుడు వాటిని బయటికి తీస్తుంది ఈ ముద్దుగుమ్మ.

  • Share this:
ఇప్పటి వరకు శ్రీముఖి అంటే కేవలం యాంకర్‌గా మాత్రమే తెలుసు. కానీ ఈమెలో యాంకర్ మాత్రమే కాదు ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయి. అవసరం వచ్చినపుడు వాటిని బయటికి తీస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కూడా ఇదే చేసింది. తాజాగా శ్రీముఖిలో ఉన్న అద్భుతమైన టాలెంట్ బయటికి వచ్చింది. ఈమె మాట్లాడుతున్నా.. అరుస్తున్నా కూడా కీచు గొంతు వేసుకుని అరుస్తుందంటూ అంతా వెక్కిరించేవాళ్లు. అయితే వాటిని చాలా లైట్ తీసుకుంటుంది శ్రీముఖి. సరదాగా వాళ్లు అన్న మాటలకు నవ్వేస్తుంటుంది. శ్రీముఖి వాయిస్‌ను అలా ఆడుకోవడం అంతా అలవాటు చేసుకున్నారు కూడా. దాని చుట్టూనే కామెడీ సీన్స్ కూడా అల్లేస్తుంటారు. అయితే ఈమెలో మరో టాలెంట్ ఉంది. ఈమెలో ఇన్నాళ్లూ తెలియని సింగింగ్ టాలెంట్ బయటికి తీసుకొచ్చింది ఈ బ్యూటీ. మైక్ పట్టుకుని గట్టిగా అరిచేసే శ్రీముఖిలో అంత స్రావ్యమైన స్వరం కూడా ఉంది. ఇప్పుడు ఓ కార్యక్రమంలో శ్రీముఖి పాడిన పాటకు అంతా ఫిదా అయిపోయారు. దీవాళీ దీపాన్ని అంటూ శ్రీముఖి పాడిన పాట విని అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు.

నిజంగానే అమ్మడి గొంతు ఇంత బాగుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. శ్రీముఖి గొంతులో ఇన్ని స్వరాలు దాగున్నాయా అనుకుంటున్నారు. దివాళీ దీపాన్ని పాటకు ఆమె స్వరం బాగా సూట్ అయింది. దాంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. దివాళీ దీపాన్ని మాత్రమే కాదు సూపర్ మచ్చి పాటతో కూడా ఆకట్టుకుంది శ్రీముఖి. ఈ రెండు పాటలు చూసిన తర్వాత శ్రీముఖి గొంతుపై ఇంకెవరూ కామెంట్ చేయరేమో..? ఇన్నాళ్లూ కేవలం రాములమ్మా అంటూ రచ్చ చేసిన శ్రీముఖి.. ఇప్పుడు మాత్రం మంచి పాటతో మాయ చేసింది. కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం చాలా బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. వరస షోలతో పాటు ఈవెంట్స్ కూడా చేసుకుంటుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు