Home /News /movies /

ANCHOR SREEMUKHI IN JAGITAL DISTRICT FOR AVINASH MARRIAGE HERE ARE THE DETAILS MK

Sreemukhi: కల్లు పార్టీలో శ్రీముఖి...ఆమె చేసిన రచ్చకు అందరూ షాక్..అవినాష్ కళ్లముందే...ఏం జరిగిందంటే..

Image : Instagram

Image : Instagram

శ్రీముఖికి ఇండస్ట్రీలో ఎవరైనా మంచి ఫ్రెండ్ ఉన్నాడంటే అది ముక్కు అవినాశ్ అనే చెప్పాలి. ఇద్దరు కలిసి ఎక్కువగా షోస్ చేయకపోయినా, ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది.

    Anchor Srimukhi: శ్రీముఖి(Anchor Srimukhi) అంటే కొత్తగా పరిచయం అక్కర్లేదు. పైగా బిగ్ బాస్ పుణ్యమా అని మరింత క్రేజ్ తెచ్చుకుంది కూడా. ఈ షో తర్వాత మరోసారి కెరీర్‌పై ఫోకస్ చేసింది. రియాలిటీ షోలతో పాటు అప్పుడప్పుడూ సినిమాలు కూడా చేస్తుంది. ఈ అమ్మడు 2012లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘జులాయి’ సినిమాలో హీరో చెల్లెలు పాత్రలో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ప్రేమ ఇష్క్ కాదల్’ మూవీలో లీడ్ యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ‘అదుర్స్’ టీవీ రియాలిటీ షో , సూపర్ సింగర్ 9 ప్రోగ్రామ్స్‌ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమైన ‘పటాస్’ షో శ్రీముఖికి మాస్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.  టీవీ, సినిమాల్లో వచ్చిన పాపులారిటీతో నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3లో పాల్గొంది. అంతేకాదు ఈ షోలో రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్టించారు. ప్రస్తుతం శ్రీముఖి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు ఈమె ప్రధాన పాత్రలో పలు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.

    Bigg Boss 5 Telugu: ఏడుపు రాజా ఔట్.. బిగ్ బాస్ 5 తెలుగులో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడే..


    శ్రీముఖికి ఇండస్ట్రీలో ఎవరైనా మంచి ఫ్రెండ్ ఉన్నాడంటే అది ముక్కు అవినాశ్ అనే చెప్పాలి. ఇద్దరు కలిసి ఎక్కువగా షోస్ చేయకపోయినా, ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఇద్దరు కలిసి స్టార్ మాలో మ్యూజిక్ ప్రోగ్రాం చేశారు. ఆ తర్వాత శ్రీముఖి రికమండేషన్ మీదనే, ఆమెపై నమ్మకం ఉంచి అవినాశ్ జబర్దస్త్ లో తన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో బయటకు వచ్చేశాడు. అంతేనా శ్రీముఖి సపోర్ట్ తో యూట్యూబ్ చానెల్ ద్వారా కూడా అవినాశ్ మంచి ఆదాయం సంపాదిస్తున్నాడు. ఇదిలా ఉంటే ముక్కుఅవినాశ్ ఈ మధ్య కాలంలోనే పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లిలోనూ శ్రీముఖి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. మొత్తం పెళ్లిలో తానే పెద్దగా వ్యవహరించింది. అంతేకాదు శ్రీముఖి తన స్నేహితుడు అవినాశ్ పెళ్లి అయిన తర్వాత అతడి సొంత గ్రామమైన జగిత్యాలకు రిసెప్షన్ లో పాల్గొనేందుకు పోయింది. అక్కడ జరిగిన విశేషాలను శ్రీముఖి తన యూట్యూబ్ చానెల్ లో వ్లాగ్ రూపంలో పరిచయం చేసింది.

    Allu Arjun brother Bobby: అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ గురించి ఈ నిజాలు మీకు తెలుసా..?


    జగిత్యాల జిల్లాలో బైక్ పై అవినాశ్ గ్రామానికి వెళుతూ, శ్రీముఖి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. శ్రీముఖి తన స్నేహితులతో కలిసి అవినాష్ స్వగ్రామమైన జగిత్యాల జిల్లా రాఘవపట్నం కారులో చేరుకుంది. అంతేనా అక్కడ ఊర్లోకి అడుగుపెడుతూనే నేరుగా అవినాష్ స్వంత మామిడి తోటలో హంగామా చేసింది. అక్కడ అవినాష్ ప్రత్యేకంగా కల్లు పార్టీ ఏర్పాటు చేశాడు. నాటు కోడి, కల్లు ముంతలతో అవినాష్ శ్రీముఖి స్నేహితులకు స్వాగతం తెలిపాడు. అయితే ఈ వీడియో వ్లాగ్ లో అవినాష్ సోదరుడు, అలాగే శ్రీముఖి స్నేహితులు కల్లు తాగినట్లు కనిపించింది. కానీ శ్రీముఖి మాత్రం కల్లు తాగిందా, లేదా అనే దానిపై వీడియోలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ అక్కడి పరిస్థితి  చూస్తే మాత్రం అందరూ పార్టీలో బాగా ఎంజాయ్ చేసినట్లు అర్థం అవుతోంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Anchor Sreemukhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు