హోమ్ /వార్తలు /సినిమా /

Anchor Sreemukhi Crazy Uncles movie: శ్రీముఖి సినిమాపై వివాదం.. క్రేజీ అంకుల్స్‌పై మహిళా సంఘాల ఆగ్రహం..

Anchor Sreemukhi Crazy Uncles movie: శ్రీముఖి సినిమాపై వివాదం.. క్రేజీ అంకుల్స్‌పై మహిళా సంఘాల ఆగ్రహం..

యాంకర్ శ్రీముఖి క్రేజీ అంకుల్స్ సినిమా (sreemukhi crazy uncles movie)

యాంకర్ శ్రీముఖి క్రేజీ అంకుల్స్ సినిమా (sreemukhi crazy uncles movie)

Anchor Sreemukhi Crazy Uncles movie: ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని తెగ ఆరాటపడుతుంది యాంకర్ శ్రీముఖి (Crazy Uncles). మధ్యలో కొన్ని సినిమాల్లో నటించింది కూడా.

ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని తెగ ఆరాటపడుతుంది యాంకర్ శ్రీముఖి. మధ్యలో కొన్ని సినిమాల్లో నటించింది కూడా. అయితే హీరోయిన్‌గా నటించిన సినిమాలు విడుదలైనట్లు కూడా ప్రేక్షకులకు గుర్తు లేదు. మరోవైపు ఆమె సపోర్టింగ్ కారెక్టర్స్ చేసిన సినిమాలు మాత్రమే బాగా ఆడాయి. దాంతో హీరోయిన్ కారెక్టర్స్ శ్రీముఖికి ఇవ్వడమే మానేసారు దర్శక నిర్మాతలు. ఇలాంటి సమయంలో ఈమె ప్రముఖ పాత్రలో వచ్చిన సినిమా క్రేజీ అంకుల్స్. ఆగస్ట్ 19న ఈ సినిమా విడుదలైంది. అది కూడా థియేటర్లలోనే. ముందు ఓటిటిలో విడుదల చేయాలనుకున్నా కూడా తర్వాత మనసు మార్చుకుని థియేటర్స్‌లో విడుదల చేసారు మేకర్స్. కామెడీ సినిమాల దర్శకుడు ఇ సత్తిబాబు క్రేజీ అంకుల్స్ తెరకెక్కించాడు.

ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌లో మహిళలను కించపరిచేలా డైలాగులు ఉన్నాయని ఇప్పటికే తెలంగాణ మహిళా ఐక్య వేదిక మండిపడింది. వెంటనే సినిమాలో డైలాగులు మార్చకపోతే తాట తీస్తామంటూ వాళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ సినిమాలో మహిళలను కించపరిచేలా చాలా మాటలున్నాయని.. సంసారం చేసుకునే మహిళలను అసభ్యంగా చూపించారంటూ వాళ్లు ఫైర్ అయ్యారు. వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

Anchor Sreemukhi,Anchor Sreemukhi twitter,Anchor Sreemukhi instagram,Anchor Sreemukhi movies,Anchor Sreemukhi Crazy Uncles movie,Anchor Sreemukhi Crazy Uncles movie controversy,Anchor Sreemukhi Crazy Uncles movie hot scenes,క్రేజీ అంకుల్స్ సినిమా,యాంకర్ శ్రీముఖి క్రేజీ అంకుల్స్ కాంట్రవర్సీ,వివాదంలో ఇరుక్కున్న శ్రీముఖి క్రేజీ అంకుల్స్ సినిమా
యాంకర్ శ్రీముఖి క్రేజీ అంకుల్స్ సినిమా (sreemukhi crazy uncles movie)

అవేం పట్టించుకోకుండా సినిమాను విడుదల చేయడంతో థియేటర్ వద్ద మహిళల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. 'క్రేజీ అంకుల్స్' చిత్ర పోస్టర్లను చించడమే కాకుండా ఏకంగా తగలెట్టేసారు. మూసాపేటలోని శ్రీరాములు థియేటర్‌కు వచ్చిన ఈ సినిమా నటులు రాజా రవీంద్ర, మనోలను మహిళలు అడ్డుకున్నారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా సన్నివేశాలున్న సినిమాలో ఎలా నటిస్తారంటూ ప్రశ్నించారు. దంపతుల మధ్య చిచ్చుపెట్టేలా సినిమాలను తీయడమేంటని ప్రశ్నిస్తూ మహిళలు ఆందోళన చేస్తున్నారు. మొత్తానికి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలిక.

First published:

Tags: Anchor Sreemukhi, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు