హోమ్ /వార్తలు /సినిమా /

జబర్ధస్త్ స్టార్ కమెడియన్‌కు సవాల్ విసిరిన మంగ్లీ

జబర్ధస్త్ స్టార్ కమెడియన్‌కు సవాల్ విసిరిన మంగ్లీ

సింగర్ మంగ్లీ

సింగర్ మంగ్లీ

జబర్దస్త్ స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో పాటు యాంకర్ శ్రీముఖి , జార్జి రెడ్డి సినిమా హీరో సందీప్ మాధవ్‌కు మంగ్లీ సవాల్ విసిరింది.

  సింగర్, తీన్మార్ మంగ్లీగా తెలుగు వాళ్లకు పరిచయమైన సత్యవతి రాథోడ్ కూడా జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటింది మంగ్లీ. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  మణికొండలోని Ghmc పార్క్ లో మూడు మొక్కలు నాటిందామె. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకప్పుడు మన పూర్వీకులు ఎండాకాలం వచ్చిందంటే చెట్లకింద కూర్చుని చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించే వారని కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో చెట్లు అంతరించిపోతున్నాయంది. దాని వల్ల వాతావరణ కాలుష్యం పెరగడమే కాకుండా భూమండలం వేడెక్కుతోందని మంగ్లీ తెలిపింది.

  రాజ్యసభ సభ్యుడు సంతోష్ అన్నకు వచ్చిన ఆలోచన చాలా గొప్పదని కొనియాడింది. సంతోష్ అన్న ఆలోచనకు నేను సెల్యూట్ తెలుపుతున్నానంది మంగ్లీ. ఈ సందర్భంగా తాను మరో ముగ్గురికి మొక్కలు నాటాలని పిలుపునిచ్చాంది. జబర్దస్త్ స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో పాటు యాంకర్ శ్రీముఖి , జార్జి రెడ్డి సినిమా హీరో సందీప్ మాధవ్ లను మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరింది. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ ప్రతినిధి కిషోర్ గౌడ్ కూడా పాల్గొన్నారు.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Jabardasth, Jabardasth comedy show, Sudigali sudheer

  ఉత్తమ కథలు