ANCHOR SHYAMALA SHOCKING REVELATION ON CAMERA MAN WHO HARASSED HER NR
Anchor Shyamala: ఆ కెమెరామాన్ అర్ధరాత్రి ఫోన్ చేసి వేధించేవాడు: యాంకర్ శ్యామల
anchor shyamala
Anchor Shyamala: సినీ ఇండస్ట్రీలో నటనకు పరిచయమైన ఎంతోమంది నటీమణులు కొన్ని రకాల వేదనలో చిక్కుకొని ఉన్నవారే ఎక్కువగా ఉంటారు. ఇప్పటికి ఎంతో మంది నటీమణులు తాము నటన
Anchor Shyamala: సినీ ఇండస్ట్రీలో నటనకు పరిచయమైన ఎంతోమంది నటీమణులు కొన్ని రకాల వేదనలో చిక్కుకొని ఉన్నవారే ఎక్కువగా ఉంటారు. ఇప్పటికి ఎంతో మంది నటీమణులు తాము నటన మొదట్లో అవకాశాల కోసం లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సందర్భాలలో పలువురు నటీమణులు ఆ విషయాలను కూడా బయటపెట్టారు. కానీ కొందరు ఎదురుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అందులో ఒకరు యాంకర్ శ్యామల. ఆమెకు జరిగిన సంఘటన గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టింది.
ఆమె చిన్నతనంలోనే సీరియల్స్ లో అడుగు పెట్టింది. పలు సీరియళ్లలో నటించిన ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బుల్లితెరలో కొన్ని ప్రోగ్రామ్లలో యాంకర్ గా చేసింది. ఇక ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి కూడా పరిచయం అయ్యింది. ఇదిలా ఉంటే తనకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని కొన్ని విషయాలు పంచుకుంది.
తనకు సినీ ఇండస్ట్రీల ఇబ్బంది తగ్గించిన అంశాలు చాలానే ఉన్నాయట. ఇండస్ట్రీకి పరిచయమైన కొత్తలో ఈమెకు తండ్రి లేడని, తల్లితో ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్న కొందరు ఇన్ డైరెక్ట్ గా వచ్చి మాట్లాడేవాలట. ఇక వాళ్లతో మాట్లాడినందుకు తన తల్లి క్లాస్ పీకేదట. ఇక ఆ సమయంలో ఇన్ డైరెక్ట్ ప్రపోజల్స్ కూడా ఎదురవడంతో ఇక అక్కడి వరకే నటించి వెళ్ళిపోదామనుకున్నాదట. అంతేకాకుండా ఓ సమయంలో తనను కెమెరా మెన్స్ కూడా భయపెట్టారట.
ఒక సీనియర్ కెమెరామెన్ తనకు అర్ధరాత్రి ఫోన్లు చేసి వేధించేవాడని, ఆ ఫోన్ తన తల్లి దగ్గర ఉండేదని.. ఇక తన తల్లి ఫోన్ లిఫ్ట్ చేస్తే మీరు మగ దిక్కులేని వాళ్లు.. నేను తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలను. మీ అమ్మాయి నేను వెళ్లి మాట్లాడుతుంటే పట్టించుకోవడం లేదు మీరైనా చెప్పండి అంటే తన తల్లితో బెదిరించేవాడట. ఇక ఆ సమయంలో తన తల్లి భయపడి ఎవరికి చెప్పాలో తెలియక ఆ ప్రోగ్రాం ప్రొడ్యూసర్ కి ఈ విషయాన్ని గడిపిందట. ఇక ఆయన మేనేజర్ ని పిలిపించి మాట్లాడించగా.. వారిద్దరూ ఫ్రెండ్స్ కావడం వల్ల ఆ కెమెరా మా నేను తీసేయాలేదట. తర్వాత ఆమె ఆ ప్రోగ్రాం నుండి తప్పుకుందట.
ఇక తను ఇండస్ట్రీలో ఎలా ఎదుగుతావో చూస్తానంటూ బాగా బెదిరించేవాడని తెలిపింది. ఇక అవన్నీ తట్టుకోలేక వెళ్ళిపోదామనే సమయంలో.. గోరింటాకు సీరియల్ లో ఫస్ట్ టైం హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని తెలిపింది. ఇక తర్వాత జగదేకవీరుడు అతిలోకసుందరి సీరియల్లో కూడా అవకాశం వచ్చిందట. ఇక ఆ సమయంలో తన అమ్మ ఆరోగ్యం బాగా లేక షూటింగ్ దగ్గరకు ఒక అసిస్టెంట్ ని పెట్టుకొని వెళ్లలేదట. ఇక ఆ సమయంలోనే యాంకర్ గా బిజీ గా మారిందట శ్యామల.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.