బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా మొదలుపెట్టి బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయింది శ్యామల. గత సీజన్లో చాలా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి తర్వాత కూడా బుల్లితెరపై తన ప్రయాణం కొనసాగిస్తుంది శ్యామల.
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా మొదలుపెట్టి బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయింది శ్యామల. గత సీజన్లో చాలా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి తర్వాత కూడా బుల్లితెరపై తన ప్రయాణం కొనసాగిస్తుంది శ్యామల. అయితే ఎంత యాంకరింగ్ చేసినా కూడా గ్లామర్ విషయంలో మాత్రం ఎక్కడో కొన్ని హద్దులు పెట్టుకునేది శ్యామల. కానీ ఇప్పుడు అవి కూడా తెంచేస్తున్నట్లు తెలుస్తుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం మన్మథుడు 2 ప్రీ రిలీజ్ వేడుక. అక్కడున్న వాతావరణం మహిమో.. లేదంటే సినిమా మహత్యమో తెలియదు కానీ శ్యామల ఫుల్ గ్లామర్ అయిపోయింది.
యాంకర్ శ్యామల ఫైల్ ఫోటో (Source: Twitter)
ఏకంగా హాట్ ఫోటోలు షేర్ చేసింది. క్లీవేజ్ షో చేస్తూ ఔరా అనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇదివరకు ఎప్పుడూ శ్యామలాను ఇలా చూడని ఫ్యాన్స్ నిజంగానే ఫిదా అయిపోయారు. అసలు మనం చూసిన శ్యామల ఈమేనా అన్నట్లు మారిపోయింది ఈ యాంకర్. క్రీమ్ కలర్.. లైట్ పింక్ కాంబినేషన్ ఉన్న డీప్ వీ నేక్ గౌన్‌లో అదిరిపోయే హాట్ ఫోజులిచ్చింది శ్యామల. మొత్తానికి క్లీవేజ్ షోకు తెరతీసి తాను కూడా అనసూయ.. రష్మి గౌతమ్ లాంటి వాళ్లకు తీసిపోను అని హింట్స్ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ.
యాంకర్ శ్యామల ఫైల్ ఫోటో (Source: Twitter)
శ్యామల డ్రస్సింగ్‌పై కొందరు ప్రశంసలు కురిపించగా.. మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. నువ్వు హీరోయిన్ కాదు.. హద్దుల్లో ఉండంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కానీ అదే సమయంలో శ్యామల గారు మీ డ్రస్ సూపర్ అంటూ మోసేస్తున్నారు కూడా. మొత్తానికి ఇప్పుడు శ్యామల గ్లామర్ షో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.