అక్కినేని,దగ్గుబాటి,మెగాస్టార్.. అందరిని టార్గెట్ చేసిన యాంకర్ శ్వేతా రెడ్డి

ఐటీ దాడుల గురించి ప్రస్తావిస్తూనే.. సురేష్ బాబు,అక్కినేని కుటుంబాలపై శ్వేతారెడ్డి విరుచుకుపడ్డారు. మీ ఇళ్లల్లో మగవాళ్లకు ఆడపిల్లలతో ఎలా మెలగాలో నేర్పించాలని సూచించారు.

news18-telugu
Updated: November 20, 2019, 12:41 PM IST
అక్కినేని,దగ్గుబాటి,మెగాస్టార్.. అందరిని టార్గెట్ చేసిన యాంకర్ శ్వేతా రెడ్డి
యాంకర్ శ్వేతారెడ్డి
  • Share this:
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఇల్లు,స్టూడియోలపై ఐటీ దాడుల నేపథ్యంలో యాంకర్ శ్వేతా రెడ్డి స్పందించారు. నాలుగేళ్లుగా సురేష్ బాబు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని కారణంగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం,ఫిలిం నగర్ రామానాయుడు స్టూడియోలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ప్రపంచానికి నీతులు చెప్పే సురేష్ బాబుకు ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలని తెలియదా అని ప్రశ్నించారు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా వేధించుకునే సురేష్ బాబుకు.. నోరు తెరిస్తే స్టార్టప్స్ గురించి,బిజినెస్ గురించి స్పీచులు దంచే సురేష్ బాబుకు ట్యాక్స్ కట్టాలని తెలియదా అని నిలదీశారు.కేంద్రంలో అధికారంలో ఉన్నది ప్రధాని నరేంద్ర మోదీ అని.. తేడా వస్తే ఆ బిగ్‌బాస్ ఎవర్నీ వదిలిపెట్టడని శ్వేతారెడ్డి అన్నారు. మెగాస్టార్ చిరంజీవి అయినా,అక్కినేని నాగార్జున అయినా,మేఘా కృష్ణారెడ్డి అయినా..తేడా వస్తే ఐటీ దాడులు జరుగుతాయన్నారు.

ఐటీ దాడుల గురించి ప్రస్తావిస్తూనే.. సురేష్ బాబు,అక్కినేని కుటుంబాలపై శ్వేతారెడ్డి విరుచుకుపడ్డారు. మీ ఇళ్లల్లో మగవాళ్లకు ఆడపిల్లలతో ఎలా మెలగాలో నేర్పించాలని సూచించారు. ఇండస్ట్రీలో ఎంతోమంది అమ్మాయిలు బలైపోతుంటారని.. కానీ శ్రీరెడ్డి లాగా కొంతమందే బయటకు వస్తుంటారని అన్నారు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేవారికి కాలమే శిక్ష వేస్తుందని చెప్పారు.





First published: November 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...