• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ANCHOR RAVI WIFE NITYA SAXENA SHARED SOME UNKNOWN SECRETS ABOUT HER HUSBAND IN ANCHOR SUMA SHOW PK

Anchor Ravi Wife Nitya: తెల్లవారు జామున 3 గంటల వరకు.. యాంకర్ రవి సీక్రేట్స్ బయటపెట్టిన భార్య నిత్య..

Anchor Ravi Wife Nitya: తెల్లవారు జామున 3 గంటల వరకు.. యాంకర్ రవి సీక్రేట్స్ బయటపెట్టిన భార్య నిత్య..

భార్య నిత్యా సక్సేనాతో యాంకర్ రవి (anchor ravi nitya saxena)

Anchor Ravi Wife Nitya: బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షోకు భార్యతో పాటు వచ్చాడు రవి(Anchor Ravi). అందులోనే తన గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. అలాగే రవి భార్య నిత్య కూడా భర్త గురించి కొన్ని సీక్రేట్స్ బయటపెట్టింది. ముఖ్యంగా ఇంట్లో రవి ఎలా ఉంటాడనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది.

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ రవికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేల్ యాంకర్స్‌లో ప్రదీప్ క్లాస్ ఫాలోయింగ్ సంపాదిస్తే.. మాస్ మహారాజా అనిపించుకున్నాడు రవి. పటాస్ లాంటి షోలను ఏళ్ల పాటు నడిపించిన ఘనత మనోడి సొంతం. అంతేకాదు మాస్ యాంకరింగ్‌తో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఎఫైర్స్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు ఈ యాంకర్ ట్రెండింగ్‌లోనే ఉంటాడు. కానీ రెండేళ్లుగా అన్నీ బంద్ అయిపోయాయి. ఆ మధ్య ఓ రోజు సడన్‌గా తన భార్య నిత్య సక్సేనాతో పాటు కూతురును కూడా ప్రపంచానికి పరిచయం చేసాడు యాంకర్ రవి. అప్పటి వరకు ఈయనకు పెళ్లైపోయిందని చాలా మందికి కనీసం ఐడియా కూడా లేదు. ఉన్నట్లుండి తన పర్సనల్ లైఫ్‌ను బయటపెట్టేసాడు రవి. ఇదిలా ఉంటే భార్య నిత్యను పరిచయం చేసిన తర్వాత ప్రతీ ఈవెంట్‌ను కూడా ఆమెతో జరుపుకుంటూ.. ఆ వీడియోను అభిమానులతో పంచుకుంటున్నాడు రవి. ఇప్పుడు కూడా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షోకు భార్యతో పాటు వచ్చాడు రవి. ఈ షోను యాంకర్ సుమతో కలిసి కో హోస్ట్ చేస్తున్నాడు రవి. తాజా ఎపిసోడ్‌కు రవి భార్య కూడా వచ్చింది. అందులోనే తన గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. అలాగే రవి భార్య నిత్య కూడా భర్త గురించి కొన్ని సీక్రేట్స్ బయటపెట్టింది.

ముఖ్యంగా ఇంట్లో రవి ఎలా ఉంటాడనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది. స్టార్ యాంకర్ సుమ దీనికి హోస్టింగ్ చేస్తుంది. ఇందులో రవి దంపతులు వచ్చినపుడు ఆమె బాగానే ఆడుకుంది. ముఖ్యంగా రవి ఇంటికి ఎప్పుడు వస్తాడని అడిగినపుడు.. తెల్లవారు జామున 3 గంటలకు వస్తాడని చెప్పింది నిత్య. మరి మీరేం అనరా అంటే ఏమంటాం.. షూటింగ్‌లో లేట్ అయిందని సమాధానం చెప్తాడని.. ఎప్పుడు అడిగినా కూడా షూటింగ్ అనే చెప్తాడని చెప్పుకొచ్చింది నిత్య సక్సేనా.

రవి ఫోన్‌లో మీ పేరు ఏమని సేవ్ చేసుకుంటాడని అడిగితే.. తెలియదు అని సమాధానమిచ్చింది నిత్యా సక్సేనా. అంతేకాదు.. రవి సెల్ ఫోన్ పాస్ వర్డ్ కూడా తెలియదని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. రవి మొబైల్ చూసే సాహసం కూడా చేయనంటూ నిత్య రవి పరువు తీసేసింది. అందులో ఏమేం చూడాల్సి వస్తుందో అంటూ సెటైర్లు వేసింది నిత్య. ఇదిలా ఉంటే ఈటీవీలో పటాస్ మానేసిన తర్వాత అటు వైపు వెళ్లడం లేదు యాంకర్ రవి. ఈటీవీ కంటే కూడా జీ, మా టీవీల్లోనే ఈయన ఎక్కువగా కనిపిస్తున్నాడు. అంతేకాదు తన మాజీ స్నేహితురాలు లాస్యతో కలిసి వరస షోలు చేస్తున్నాడు యాంకర్ రవి.
Published by:Praveen Kumar Vadla
First published: