యాంకర్ రవి చేసిన పనికి సంపూర్ణేష్ బాబు ఫైర్...ఢీ షో వేదికగా రచ్చ...

సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరిమట్టను చేర్చడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సంపూర్ణేష్ బాబును ఎగతాళి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటున్నారు.

news18-telugu
Updated: November 14, 2019, 8:21 PM IST
యాంకర్ రవి చేసిన పనికి సంపూర్ణేష్ బాబు ఫైర్...ఢీ షో వేదికగా రచ్చ...
యాంకర్ రవి, సంపూర్ణేష్ బాబు
  • Share this:
ఎప్పుడూ సరదాగా జరిగిపోయే ఢీ షోలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. యాంకర్ రవి వచ్చినప్పటి నుంచి షోలో ఎనర్జీ పెంచడంలో భాగంగా చేస్తున్న కామెంట్స్ వివాదాలు రాజేస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన ఢీ ప్రోమోలో యాంకర్ రవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ గా నిలిచింది. ఎప్పటిలాగే సుడిగాలి సుధీర్‌ను కార్నర్ చేస్తున్న సమయంలో కొబ్బరి మట్ట టాపిక్ తీసుకొచ్చాడు. సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరిమట్ట సినిమాతో సుడిగాలి సుధీర్ ను పోల్చుతూ అందులో మట్టవు నువ్వే అంటూ ఎగతాళి చేశాడు. అయితే వీళ్లిద్దరి మధ్యలో సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరిమట్టను చేర్చడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సంపూర్ణేష్ బాబును ఎగతాళి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటున్నారు. అంతేకాదు సుడిగాలి సుధీర్ ను సైతం అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువగా కార్నర్ చేస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వినిపిస్తున్నాయి.

First published: November 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>