Anchor Ravi - Ashu Reddy: బుల్లితెరపై మేల్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రవి పరిచయం గురించి అందరికి తెలిసిందే.ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. వెండితెరపై కూడా పలు అవకాశాలు అందుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను, వీడియోలను బాగా షేర్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం పలు షోలలో బాగా బిజీగా ఉన్నాడు. ఇక మరో ఆర్టిస్ట్ అషు రెడ్డి తో కలిసి ఓ షోలో యాంకరింగ్ కూడా చేస్తున్నాడు.
డబ్ స్మాష్ వీడియోలతో జూనియర్ సమంత గా గుర్తింపు పొంది వెండితెరపై అవకాశాలు అందుకున్న సెలబ్రిటీ అషు రెడ్డి. బిగ్ బాస్ లో అడుగు పెట్టి మరింత క్రేజ్ సంపాదించుకుంది. అంతే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం యాంకర్ రవి తో కలిసి హ్యాపీ డేస్ అనే షో చేస్తుంది. ఇక ఇందులో రవితో కలిసి బాగా రచ్చ చేస్తూ ఉంటుంది. ఎక్స్ ప్రెస్ హరి, జబర్దస్త్ అజయ్ కూడా ఈ షోలో భాగంగా ఉన్నారు. ఇదిలా ఉంటే అషు రెడ్డి వీడియోను లీక్ చేసాడు యాంకర్ రవి.
ఈమధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రతి ఒక్కరు ఫన్నీ వీడియోలను బాగా చేస్తున్నారు. ఇక తాజాగా రవి.. అషు రెడ్డిని మోసం చేసి ఓ వీడియో తీసాడు. షూటింగ్ విరామ సమయంలో అషుతో ఓ రొమాంటిక్ వీడియోను చేస్తానని చెప్పగా.. వెంటనే షూట్ కి రెడీ అయిన అషు.. తను నడిచి వస్తుంటే రొమాంటిక్ బ్యాక్ గ్రౌండ్ కు బదులు వనస్థలిపురం అడవి పంది అని బ్యాక్ గ్రౌండ్ గా పెట్టాడు.
View this post on Instagram
ఇక ఈ వీడియోను తన ఇన్ స్టా వేదికగా షేర్ చేయగా ప్రస్తుతం అది నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోని చుసిన ప్రతి ఒక్కరూ తెగ నవ్వుకున్నారు. ఈ వీడియోని చూసిన అషు రెడ్డి.. త్వరలో నువ్వు కూడా దొరుకుతావు అంటూ కానీ కామెడీగా ఉందని నవ్వలేకపోతున్న అని స్పందించింది. ఇక రవి కూడా వనస్థలిపురం ఎప్పుడు పోయావు అంటూ రివర్స్ పంచ్ వేసాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor ravi, Ashu reddy, Etv plus, Happy days program, Instagram