అది ముమ్మాటికి తప్పే... ఏపీ ప్రజలకు యాంకర్ రవి క్షమాపణలు

కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ టీవీ షోలో ఏపీ ప్రజలను కించపరిచే విధంగా ఓ కంటెస్టెంట్ వ్యాఖ్యలు చేయడం... దానికి యాంకర్ రవి సపోర్ట్ చేసినట్టుగా కామెంట్స్ చేయడంతో వివాదం మొదలైంది. అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు యాంకర్ రవిపై దుమ్మెత్తి పోస్తున్నారు.

news18-telugu
Updated: June 15, 2019, 8:53 AM IST
అది ముమ్మాటికి తప్పే... ఏపీ ప్రజలకు యాంకర్ రవి క్షమాపణలు
టీవీ యాంకర్ రవి(ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రముఖ బుల్లితెర యాంకర్ రవి ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ టీవీ షోలో ఏపీ ప్రజలను కించపరిచే విధంగా ఓ కంటెస్టెంట్ వ్యాఖ్యలు చేయడం... దానికి యాంకర్ రవి సపోర్ట్ చేసినట్టుగా కామెంట్స్ చేయడంతో వివాదం మొదలైంది. అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు యాంకర్ రవిపై దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రజలను అవమానించే విధంగా కామెంట్స్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. యాంకర్ రవి పర్సనల్ అసిస్టెంట్ ఫోన్‌కు కాల్ చేసి మండిపడుతున్నారు. వివాదం ముదరడంతో రంగంలోకి దిగిన యాంకర్ రవి... ఏపీ ప్రజలకు క్షమాపణలు చెబతూ వీడియో రిలీజ్ చేశాడు. ఆ రోజు టీవీలో జరిగింది ముమ్మాటికీ తప్పే అని అన్నాడు. అయితే యాంకర్‌గా తన స్థానంలో ఎవరున్నా అలాగే చేసేవారని వివరణ ఇచ్చాడు. తనకు ఏపీ ప్రజలు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటే ఎంతో అభిమానమని చెప్పుకొచ్చాడు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని నెటిజన్లను కోరాడు.
అయితే యాంకర్ రవి ఈ రకమైన వివాదాల్లో ఇరుక్కోవడం కొత్తేమీ కాదు. గతంలో ఓ ఆడియో ఫంక్షన్‌లో మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన నటుడు చలపతిరావు కామెంట్స్‌ను సపోర్ట్ చేసినట్టుగా యాంకర్ రవి చేసిన కామెంట్స్‌పై పెద్ద దుమారమే చెలరేగింది. ఈ వివాదంలో నటుడు చలపతిరావుతో పాటు యాంకర్ రవిపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జరిగిన తప్పుకు యాంకర్ రవి కూడా క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా మరోసారి ఈ రకంగా వివాదాన్ని కొనితెచ్చుకున్న యాంకర్ రవి... సారీ అంటూ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు.
Published by: Kishore Akkaladevi
First published: June 15, 2019, 8:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading