యాంకర్ రవిని ఘోరంగా అవమానించిన ప్రదీప్...సుధీర్ దెబ్బ మామూలుగా లేదుగా...

సుధీర్‌కు ఉన్న రేంజ్ కారణంగా ప్రస్తుతం అతడితో ఎందుకు గొడవ అన్నట్లు ఢీ యూనిట్ అనుకుందని కూడా సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకే సైలెంట్ గా రవిని పక్కన పెట్టేసారట. అయితే ఇదే కనుక నిజమైతే సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కాలర్ ఎగురేసుకొని తిరగాల్సిందే.

news18-telugu
Updated: November 30, 2019, 5:56 PM IST
యాంకర్ రవిని ఘోరంగా అవమానించిన ప్రదీప్...సుధీర్ దెబ్బ మామూలుగా లేదుగా...
సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్, రవి (Image: Facebook)
  • Share this:
ఢీ షోలో ప్రదీప్ రీఎంట్రీ ఇచ్చేశాడు. ఇప్పటికే ఫ్రెష్ ఎపిసోడ్ ప్రోమోలో యాంకర్ రవి ఔట్ అయినట్లు సమాచారం. అయితే ప్రదీప్ రీఎంట్రీలో చేసిన కామెంట్ ప్రస్తుతం హీట్ పుట్టిస్తోంది. అందులో ప్రతీ ఒక్కరూ గాంగ్ స్టరే, కానీ నిజమైన గ్యాంగ్ స్టర్ అంటూ పరోక్షంగా యాంంకర్ రవిపై సటైర్లు వేసినట్లు సమాచారం. అయితే యాంకర్ రవి వెళ్లిపోవడానికి సుడిగాలి సుధీర్ కూడా కారణమే అనే టాక్ వినిపిస్తోంది. యాంకర్ రవి ఢీ షోలో రెచ్చిపోదాం అనుకున్నాడని, అయితే అనుకున్నట్లుగానే సుడిగాలి సుధీర్ పై ఇష్టం వచ్చినట్లు పంచులు కురిపిస్తూ తాను హైలైట్ అవ్వాలని అనుకున్నాడని, అయితే అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అన్నట్లు అయ్యింది. సుడిగాలి సుధీర్‌తో రవి అనవసరంగా కామెంట్స్ చేశాడని, అవసరానికి మించి పంచులు వేస్తున్నాడని టాక్.

అయితే సుధీర్‌కు ఉన్న రేంజ్ కారణంగా ప్రస్తుతం అతడితో ఎందుకు గొడవ అన్నట్లు ఢీ యూనిట్ అనుకుందని కూడా సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకే సైలెంట్ గా రవిని పక్కన పెట్టేసారట. అయితే ఇదే కనుక నిజమైతే సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కాలర్ ఎగురేసుకొని తిరగాల్సిందే.
First published: November 30, 2019, 5:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading