సుడిగాలి దెబ్బకు ఢీ నుంచి యాంకర్ రవి ఔట్...సుధీర్ రేంజ్ ఇది అంటున్న ఫ్యాన్స్...

సుడిగాలి సుధీర్, రవి

సుడిగాలి సుధీర్ ను రవి అనవసరంగా గెలుక్కొని అవసరానికి మించి పంచులు వేస్తున్నాడని టాక్, కాగా సుధీర్‌కు ఉన్న రేంజ్ కారణంగా ప్రస్తుతం అతడితో ఎందుకు గొడవ అన్నట్లు ఢీ యూనిట్ అనుకుందని, అందుకే సైలెంట్ గా రవిని పక్కన పెట్టేసారట.

  • Share this:
    ఢీ షోలో ప్రదీప్ స్థానంలో ఎంట్రీ ఇచ్చిన యాంకర్ రవి కూడా ఔట్ అయినట్లు సమాచారం. అయితే యాంకర్ రవి స్థానంలో మళ్లీ ప్రదీప్ రీఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. అయితే యాంకర్ రవి వెళ్లిపోవడానికి అతడు స్క్రీన్ పై చేస్తున్న ఓవర్ యాక్షనే కారణమని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా యాంకర్ రవి తన ఎనర్జీతో ఢీ షోలో రెచ్చిపోదాం అనుకున్నాడని, అయితే అనుకున్నట్లుగానే సుడిగాలి సుధీర్ పై ఇష్టం వచ్చినట్లు పంచులు కురిపిస్తూ తాను హైలైట్ అవ్వాలని అనుకున్నాడని, అయితే అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అన్నట్లు అయ్యింది.

    సుడిగాలి సుధీర్ ను రవి అనవసరంగా గెలుక్కొని అవసరానికి మించి పంచులు వేస్తున్నాడని టాక్, కాగా సుధీర్‌కు ఉన్న రేంజ్ కారణంగా ప్రస్తుతం అతడితో ఎందుకు గొడవ అన్నట్లు ఢీ యూనిట్ అనుకుందని, అందుకే సైలెంట్ గా రవిని పక్కన పెట్టేసారట. ఇక ఇదే షోలో మరోసారి ప్రదీప్ రీఎంట్రీ ఇవ్వడంతో మరోసారి పాత టీమ్ ఢీలో తమ సత్తా చాటుతుందని టాక్.
    Published by:Krishna Adithya
    First published: