SreeMukhi: తమ ఎఫైర్ గురించి ఓపెన్ అయిన యాంకర్ శ్రీముఖి, రవి..

శ్రీముఖి, యాంకర్ రవి.. ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాస్యతో షో ఆపేసిన తర్వాత రవికి పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంది శ్రీముఖి. తాజాగా వీళ్లిద్దరు తమ మధ్య ఉన్న రిలేషన్ పై ఆలీ తో సరదగా కార్యక్రమంలో పంచుకున్నారు.

news18-telugu
Updated: April 9, 2020, 1:52 PM IST
SreeMukhi: తమ ఎఫైర్ గురించి ఓపెన్ అయిన యాంకర్ శ్రీముఖి, రవి..
బిగ్ బాస్‌లో ఉన్నపుడు తాను ఒకర్ని ప్రేమించి మోసపోయానని చెప్పుకొచ్చింది శ్రీముఖి. అతడు రవి అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అతడు తన దగ్గర పెళ్లైన విషయాన్ని దాచాడని.. అందుకే తను రిలేషన్ నుంచి బయటికి వచ్చేసానని చెప్పింది శ్రీముఖి.
  • Share this:
శ్రీముఖి, యాంకర్ రవి.. ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాస్యతో షో ఆపేసిన తర్వాత రవికి పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంది శ్రీముఖి. ఈ ఇద్దరూ కలిసి చేసిన పటాస్ స్టాండప్ కామెడీ షో రికార్డులు తిరగరాసింది. అప్పటి వరకు ఈటీవీ ప్లస్ అనే ఛానెల్ అనేది ఎవరికి పెద్దగా తెలియకపోయినా కూడా పటాస్ షోతోనే అది పాపులర్ అయింది. ముఖ్యంగా ర‌వి, శ్రీ‌ముఖి కెమిస్ట్రీనే దీన్ని నిల‌బెట్టింది. ఒకటి రెండు కాదు రెండేళ్ల పాటు ఈ షోను విజయవంతంగా రన్ చేసారు ఈ ఇద్దరూ. తాజాగా వీరిద్దరు కలిసి ఆలీతో జాలీగా కార్యక్రమంలో పాల్గొని తమకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా యాంకర్ రవి, శ్రీముఖి తమ మధ్య ఉన్న రిలేషన్ పై ఓపెన్ అయ్యారు. మా మధ్య వృత్తిగతంగా ఉన్న సంబంధమే తప్ప వ్యక్తిగతమైన సంబంధం  ఏమిలేదు. సాధారణంగా ఒక షో చేసేటపుడు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఒకరు చేతులను ఒకరు పట్టుకోవడం, దగ్గరకు తీసుకోవడం చేస్తుంటాం. అలాంటవన్ని సినిమాల్లో చూసిన ప్రేక్షకులు మా మధ్య ఏదో ఉందని అనుకుంటారు. నిజానికి మా మధ్య ఎలాంటి సంబంధం లేదు కేవలం మంచి మిత్రులని ఇద్దరు చెప్పారు.
First published: April 9, 2020, 11:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading