కొన్ని జంటలకు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది. ఆ తర్వాత ఎన్ని జంటలు వచ్చినా కూడా వాళ్లను మాత్రం రీ ప్లేస్ చేయలేరు. అలాంటి జోడీ రవి, లాస్య.. ఈ ఇద్దరూ ఒకప్పుడు బుల్లితెరపై మ్యాజిక్ చేసారు. రవి లాస్య జోడీ అంటే టిఆర్పీ రేటింగ్స్ కూడా భారీగానే వచ్చేవి. ఈ ఇద్దరూ కలిసి షో హోస్ట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత చాలా షోలు కేవలం రవి లాస్య జోడీపైనే ప్లాన్ చేసారు నిర్వాహకులు. అలా మా టీవీలో సమ్‌థింగ్ స్పెషల్ నుంచి ఇంకా చాలా చేసారు రవి లాస్య జోడీ. అప్పట్లో ఈ ఇద్దరి క్రేజ్ చూస్తే అందరికీ మెంటల్ వచ్చేసేది. రవి మాస్ యాంకర్‌కు లాస్య చిలిపి జోకులు బాగా క్రేజ్ తీసుకొచ్చాయి. అయితే అంతా బాగానే నడుస్తున్న సమయంలో ఉన్నట్లుండి రవి, లాస్య విడిపోయారు. ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరిపోయాయి. రవి అని పేరు చెప్పకుండా తనకోసం భార్యకు విడాకులు ఇచ్చి మరి ఓ అబ్బాయి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడంటూ అప్పట్లో లాస్య చెప్పిన మాటలు సంచలనంగా మారాయి. దాంతో పాటు ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. లాస్యతో విడిపోయిన తర్వాత కూడా రవి సక్సెస్ అయ్యాడు. శ్రీముఖితో కొన్నేళ్ల పాటు అదే మ్యాజిక్ రిపీట్ చేసాడు. అయితే లాస్య మాత్రం రవి నుంచి దూరం అయిన తర్వాత అంతగా సక్సెస్ కాలేదు.
సోలోగా షోలు కూడా చేయలేదు.. యాంకరింగ్‌కు బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసుకుంది. చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ 4 తో లాస్య అందరికీ పరిచయం అయింది. ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ఇక్కడ్నుంచే మొదలైంది. ఈ షోలో దాదాపు 80 రోజులు ఉండి 40 లక్షల వరకు వసూలు చేసింది ఈ యాంకర్. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడుఇరవి-లాస్య జోడీ బుల్లితెరపై సందడి చేసారు. ఈ ఇద్దరూ కలిసి చేసే ప్రోగ్రామ్ ప్రోమోను కూడా రవి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రవి, లాస్య కలవడంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ ఇద్దరూ కలవడానికి కారణం మాత్రం మరొకరు ఉన్నారు.
అతడే బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్. ఈ షోలో లాస్యకు బాగా దగ్గరయ్యాడు రవి. అక్కడ్నుంచే ఆమె విషయాలు తెలుసుకున్నాడు. అలా రవి గురించి కూడా తెలుసుకుని ఈ ఇద్దరిని మళ్లీ కలిపాడని తెలుస్తుంది. రవి, లాస్య కలవడానికి ప్రధాన కారణం అభి అని ప్రచారం జరుగుతుంది. లాస్యను ఆప్యాయంగా అక్క అని పిలుస్తుంటాడు అభి. అందుకే అక్కకు ఉన్న సమస్యను తీర్చేసాడు. అలాగే రవికి కూడా అభిజీత్ మంచి స్నేహితుడు. దాంతో తనవంతుగా ముందుకొచ్చి విడిపోయిన ఈ ఆన్‌స్క్రీన్ మ్యాజికల్ జంటను మళ్లీ కలిపాడు. ఏదేమైనా కూడా ఇప్పట్నుంచి మళ్లీ రవి, లాస్య కలిసి యాంకరింగ్ చేస్తే మాత్రం కచ్చితంగా షోలు బాగానే వస్తాయనడంలో సందేహం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor lasya, Anchor ravi, Telugu Cinema, Tollywood