యాంకర్ రవి వెనుక భారీ కుట్ర...ఏంటో తెలిస్తే షాకే...

శ్రీముఖితో కలిసి లాస్య ఓ భారీ ప్రోగ్రాంతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. పనిలోపనిగా రవి మీద రివేంజ్ తీర్చుకునేందుకు కూడా శ్రీముఖి, లాస్య ప్లాన్స్ లో ఉన్నారని, ముందుగా వీరిద్దరూ కలిసి ఓ ప్రముఖ యూట్యూబ్ చానెల్ లో కలిసి ఇంటర్వ్యూ ఇస్తారని, అందులో యాంకర్ రవి గురించి అసలు నిజాలు బయటపెడతారని తెలుస్తోంది.

news18-telugu
Updated: May 23, 2020, 4:29 PM IST
యాంకర్ రవి వెనుక భారీ కుట్ర...ఏంటో తెలిస్తే షాకే...
రవి: లక్ష రూపాయలు (ఈవెంట్ లేదంటే షో)
  • Share this:
యాంకర్ రవి ఇప్పుడు వివాదాలకు దూరంగా కాస్త హాయిగా కనిపిస్తున్నాడు. అటు పటాస్ నుంచి బయట పడిన తర్వాత, జీ తెలుగులో వరుస ప్రోగ్రాంలో రవి కాస్త బిజీ అయ్యాడు. అయితే ప్రస్తుతం రవి మల్లెమాల వారి ప్రోగ్రామ్స్ అన్నింటి నుంచి బయటపడ్డాడు. దీని వెనుక శ్రీముఖితో విబేధాలే కారణమనే సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అటు శ్రీముఖి కూడా మల్లెమాలతో ప్రస్తుతం ఎలాంటి ప్రోగ్రాంలు చేయకపోయినా..భవిష్యత్తులో మాత్రం ఓ పెద్ద షో ద్వారా రంగప్రవేశం చేసేందుకు స్కెచ్ వేస్తోంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. యాంకర్ రవి కెరీర్ తొలినాళ్లలో యాంకర్ లాస్యతో కలిసి అనేక షోస్ చేశాడు. రవి యాటిట్యూడ్ వల్లనో లేక లాస్య ఈగో ప్రాబ్లం వల్లనో తెలియదు కానీ ఇద్దరూ సడెన్ గా విడిపోయారు. అటు పటాస్ లో లాస్య ప్లేస్ లో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చేసింది. రవి కూడా లాస్య కన్నా శ్రీముఖితోనే ఎక్కువ కంఫర్ట్ ఫీలయ్యాడు. ఇద్దరూ కలిసి పటాస్ లో ఇరగదీశారు. ఊరమాస్ రేంజ్ లో రెచ్చిపోయారు. అయితే ఏమైందో తెలీదు. పటాస్ నుంచి ఇద్దరూ బయటకు వచ్చేశారు. బిగ్ బాస్ తో శ్రీముఖి ఎగ్జిట్ డోర్ వెతుక్కుంటే, రవి కూడా జీ తెలుగులో కొత్త షోస్ తో కొత్త దారి వెతుక్కున్నాడు. అయితే ఇక్కడే కొత్త ట్విస్ట్ ఎదురైంది. ఈ మధ్య కాలంలోనే మల్లెమాల వారి ఉగాది ఈవెంట్ పండగ సార్ పండగ అంతే..లో సడెన్ గా లాస్య రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే...ఈ ప్రోగ్రాంలో శ్రీముఖి కూడా పార్టిసిపేట్ చేసింది. నిజానికి వీరిద్దరూ గతంలో రవి ఇష్యూలో శ్రీముఖి అతడికి సపోర్ట్ గా నిలిస్తే, లాస్య పూర్తి ఆపోజిట్ గా కామెంట్స్ చేసింది. అయితే ప్రస్తుతం వీరిద్దరూ తమ మధ్య అన్ని ఇష్యూస్ మరిచిపోయి కలిసి పోయారు. వీరిద్దరూ కలిసిపోయేందుకు కామన్ పాయింట్ యాంకర్ రవి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇదిలా ఉంటే రవి నుంచి విడిపోయిన శ్రీముఖి, లాస్య కలవడం వెనుక భారీ ప్లాన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఒకప్పుడు యాంకర్ సుమకు రీప్లేస్ మెంట్ అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ మన్ననలు పొందిన లాస్య ఉన్నపళంగా బుల్లితెరకు దూరమైంది. అయితే ఇప్పుడు సుమ తర్వాత అలాంటి హోమ్లీ యాంకర్స్ బుల్లితెరకు కరువయ్యారు. అనసూయ, రష్మీ, వర్షిణి, విష్ణుప్రియ లాంటి వాళ్లు ఉన్నా వారెవరూ సుమకు సరికారు. దీంతో ఇప్పుడు శ్రీముఖితో కలిసి లాస్య ఓ భారీ ప్రోగ్రాంతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. పనిలోపనిగా రవి మీద రివేంజ్ తీర్చుకునేందుకు కూడా శ్రీముఖి, లాస్య ప్లాన్స్ లో ఉన్నారని, ముందుగా వీరిద్దరూ కలిసి ఓ ప్రముఖ యూట్యూబ్ చానెల్ లో కలిసి ఇంటర్వ్యూ ఇస్తారని, అందులో యాంకర్ రవి గురించి అసలు నిజాలు బయటపెడతారని తెలుస్తోంది. ఇదే జరిగితే యాంకర్ రవి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు.
Published by: Krishna Adithya
First published: May 23, 2020, 4:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading