Anchor Ravi: రాత్రి అయింది.. మనకేమైనా ఉందా అంటూ లాస్యపై రవి కామెంట్స్.. మరి ఇంత అవసరమా?

Anchor Ravi

Anchor Ravi: బుల్లితెరపై క్రేజీ జంటగా పిలిపించుకున్న లాస్య, రవి. ఒకప్పుడు మంచి ఫేమ్ లో ఉన్న ఈ జంట మంచి ఫాలోయింగ్ ను అందుకున్నారు. ఆ తర్వాత వీళ్లు పలు అవకాశాలతో సెలబ్రిటీ గా గుర్తింపు పొందారు.

 • Share this:
  Anchor Ravi: బుల్లితెరపై క్రేజీ జంటగా పిలిపించుకున్న లాస్య, రవి. ఒకప్పుడు మంచి ఫేమ్ లో ఉన్న ఈ జంట మంచి ఫాలోయింగ్ ను అందుకున్నారు. ఆ తర్వాత వీళ్లు పలు అవకాశాలతో సెలబ్రిటీ గా గుర్తింపు పొందారు. ఇక ఈ జంట సంథింగ్ స్పెషల్ అనే ప్రోగ్రామ్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అలా తమ మాటలతో ఎంతో బాగా ఆకట్టుకున్నారు.ఇదిలా ఉంటే మళ్లీ ప్రస్తుతం బుల్లితెరపై మళ్లీ ఈ జంట ముందుకొచ్చారు.

  దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ జంట కలుసుకోగా మళ్లీ తమ అల్లర్లతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే సంథింగ్ స్పెషల్ సమయంలో వీరిద్దరూ కొన్ని మనస్పర్థల వల్ల దూరం కాగా ఈ ఏడాది సంక్రాంతి ఈవెంట్ సందర్భంగా కలిసిపోయారు. ఇక తాజాగా స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్ షో లో తమ పర్ఫామెన్స్ తో బాగా సందడి చేస్తున్నారు. ఇక తాజాగా రవి.. లాస్య పై.. రాత్రయింది మనకి ఏమైనా ఉందా అంటూ షాక్ ఇచ్చాడు.

  ఈ జంట ఈ షో లో సినిమాల పేరడి లను బాగా స్పూఫ్స్ చేస్తుంటారు. అవి బాగా పేలడంతో మరింత హైలెట్ గా నిలిచారు రవి, లాస్య. ఇదిలా ఉంటే ఆదివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో రవి,లాస్య లు బాలయ్య, నయనతార పాత్రలో ఓ స్కిట్ చేశారు. ఇక అందులో తన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా లాస్య తో రాత్రయింది.. మనకి ఏమైనా ఉందా..? అని నాటీ కామెంట్ చేయగా.. వెంటనే లాస్య నువ్వు వేసిన గెటప్ ఏంటో గుర్తుందా అంటూ కౌంటర్ వేసింది. అంతలోనే రవి నేనేమన్నాను.. రాత్రయింది.. తినడానికి అన్నం పప్పు లాంటివి ఉంటే పెట్టు అన్నానని కవర్ చేస్తాడు. మొత్తానికి రవి.. లాస్య కు దొరికిపోకుండా బాగానే కవర్ చేశాడు.
  Published by:Navya Reddy
  First published: