యాంకర్ రవి కూతురు యాక్టింగ్ చూస్తే మతి పోవాల్సిందే..

Anchor Ravi Daughter Viya: లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఉండి ఉండి ఇంట్లో వాళ్లకు కూడా నటన నేర్పించేస్తున్నారు మన సెలబ్రిటీస్. ఇప్పుడు యాంకర్ రవి కూతురు కూడా ఇదే చేసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 27, 2020, 10:30 PM IST
యాంకర్ రవి కూతురు యాక్టింగ్ చూస్తే మతి పోవాల్సిందే..
యాంకర్ రవి కూతురు వియా షార్ట్ ఫిల్మ్ (anchor ravi daughter viya)
  • Share this:
లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఉండి ఉండి ఇంట్లో వాళ్లకు కూడా నటన నేర్పించేస్తున్నారు మన సెలబ్రిటీస్. అంతా ఇంట్లోనే ఉండి హాయిగా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. అందులో రియల్ యాక్టర్స్ కూడా కనిపిస్తున్నారు. అదేనండీ.. నిజంగానే వాళ్ల అమ్మానాన్నలు, పిల్లలు ఇలా అంతా కలిసి హోమ్ క్వారంటైన్‌లో హోమ్లీ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. ఇప్పుడు యాంకర్ రవి కూతురు కూడా ఇదే చేసింది. ఈ చిన్నారి కూడా తండ్రి బాటలోనే అదిరిపోయే నటనతో అందర్నీ మాయ చేసింది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండి ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా సందేశాన్నిస్తూనే మంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు యాంకర్స్.
యాంకర్ రవి కూతురు వియా షార్ట్ ఫిల్మ్ (anchor ravi daughter viya)
యాంకర్ రవి కూతురు వియా షార్ట్ ఫిల్మ్ (anchor ravi daughter viya)


అందులో సుమ, అనసూయ లాంటి సీనియర్స్ కూడా నటిస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే చేసారు. యాంకర్ రవితో పాటు అనసూయ భరద్వాజ్, రాహుల్ సిప్లిగంజ్, బిగ్ బాస్ అలీ రెజా కూడా నటించారు. వాళ్లతో పాటు రవి కూతురు వియా కూడా నటించింది. నాలుగు నిమిషాల పాటు సాగే ఈ షార్ట్ ఫిల్మ్‌లో రవి పని చేసుకుంటుంటే వియా వచ్చి దాగుడు మూతలు ఆడదాం అంటుంది.. రవి దాక్కుంటాడు.. ఆ తర్వాత అనసూయ ఉన్న రూమ్‌లోకి వస్తుంది.. నాన్న ఉన్నాడా అని అడుగుతుంది.. లేదని చెప్పేసరికి నువ్వే ఔట్ అంటూ అనసూయను చూపిస్తుంది.

ఆ తర్వాత అనసూయ సింగర్ రాహుల్ రూమ్‌లో దాక్కున్నట్లు చూపిస్తారు.. ఆ తర్వాత రాహుల్ ఔట్ అయితే అలీ రెజా వస్తాడు. చివరికి వియా వెళ్లి దాక్కుంటుంది. అరగంట తర్వాత కూడా దొరక్కపోయేసరికి అంతా వెతుకుతుంటే ఇంట్లోనే ఓ మూల వర్క్ చేసుకుంటుంది. రవి వచ్చి ఎక్కడున్నావ్ అని అడిగితే.. లాక్ డౌన్ కదా.. బయటికి వెళ్లలేను కదా.. ఇంట్లోనే ఉంటాను కదా అంటూ సమాధానం చెబుతుంది. అలా లాక్‌డౌన్‌లో బయటికి వెళ్లొద్దని సందేశాన్ని ఇచ్చారు. ఈ షార్ట్ ఫిల్మ్‌లో రవి కూతురు వియా కూడా అద్బుతంగా నటించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
First published: April 27, 2020, 10:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading