యాంకర్ రవి వెన్నులో భయం పుట్టించిన టాలివుడ్ హీరోయిన్...ఆమెను టచ్ చేయగానే...

ఇప్పటికే తనను సోషల్ మీడియా వేదికగా పలు వివాదాలల్లో ఇరికించారని, ఇకపై జాగ్రత్తగా ఉంటానంటూ తప్పించుకున్నాడు. అలాగే ఇదే సందుగా భావించిన తేజస్వీ మదివాడ అయితే రెచ్చిపోయి రవి వీపు బద్దలు కొట్టింది.

news18-telugu
Updated: December 22, 2019, 10:02 PM IST
యాంకర్ రవి వెన్నులో భయం పుట్టించిన టాలివుడ్ హీరోయిన్...ఆమెను టచ్ చేయగానే...
యాంకర్ రవి ఫైల్ ఫోటో
  • Share this:
యాంకర్ రవి తన ఎనర్జీ ఆటిట్యూడ్ తో ఎంతో మంది అభిమానులను కొల్లగొట్టేశాడు. అలాంటిది యాంకర్ రవి గతంలో కొన్ని వివాదాల్లో సైతం ఇరుక్కొని చివరకు బయటపడి, ఇలా షోలలో వివాదాల జోలికి వెళ్లకుండా దూరంగా ఉంటున్నాడు. తాజాగా యాంకర్ రవితో హోస్ట్‌గా ప్రారంభమైన లోకల్ గ్యాంగ్స్ ప్రోగ్రాంలో అయితే వివాదాల నీడ పడకుండా చాలా జాగ్రత్తగా మెయిన్ టెయిన్ చేస్తున్నాడు. అందుకు మచ్చుతునకగా తాజా ప్రోమోలో ఓ సీన్ ప్రత్యక్షమైంది. అందులో కొత్తగా యాంకర్ అవతారం ఎత్తిన ప్రముఖ టాలివుడ్ హీరోయిన్ కేరింత ఫేమ్ తేజస్వీ మదివాడపై సరదాగా చేయి వేయాలని యాంకర్ ప్రదీప్ కోరగా, అందుకు రవి భయం భయంగా ఆమె భుజంపై చేయివేశాడు.

అంతేకాదు ఇప్పటికే తనను సోషల్ మీడియా వేదికగా పలు వివాదాలల్లో ఇరికించారని, ఇకపై జాగ్రత్తగా ఉంటానంటూ తప్పించుకున్నాడు. అలాగే ఇదే సందుగా భావించిన తేజస్వీ మదివాడ అయితే రెచ్చిపోయి రవి వీపు బద్దలు కొట్టింది. అయినా రవి నుంచి నోరెస్పాన్స్...దీంతో గతంలో పలు వివాదాల్లో ఇరుక్కున్న రవికి మహిళా సంఘాల దెబ్బకు దారికొచ్చాడనే టాక్ సోషల్ మీడియా వేదికగా వినిపిస్తోంది.

First published: December 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు