యాంకర్ రవి చేసిన పనికి ఛీ కొట్టిన అనసూయ...ప్రదీప్ చూస్తుండగా షో మధ్యలోనే...

యాంకర్ రవి, అనసూయ (Image: Youtube)

యాంకర్ రవి మాత్రం ఈ షోను పూర్తిగా నమ్ముకున్నాడనే చెప్పాలి. ఎందుకంటే, అటు పటాస్, ఢీ రెండు షోలను వదులుకొని వచ్చిన యాంకర్ రవి ప్రస్తుతం లోకల్ గ్యాంగ్స్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

  • Share this:
    లోకల్ గ్యాంగ్స్ ప్రోగ్రామ్ సరదా సరదాగా సాగిపోతోంది. యాంకర్ అనసూయ ఈ ప్రోగ్రామ్ కు అదనపు గ్లామర్ అందిస్తోందనే చెప్పవచ్చు. అటు యాంకర్ ప్రదీప్, రవి సైతం తమ శాయశక్తులా షోను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జానీ మాస్టర్ సైతం అనసూయకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అయితే అనసూయ లోకల్ గ్యాంగ్స్ ప్రోగ్రాం కోసం చేస్తున్న డ్యాన్సులు షోకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే యాంకర్ రవి మాత్రం ఈ షోను పూర్తిగా నమ్ముకున్నాడనే చెప్పాలి. ఎందుకంటే, అటు పటాస్, ఢీ రెండు షోలను వదులుకొని వచ్చిన యాంకర్ రవి ప్రస్తుతం లోకల్ గ్యాంగ్స్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. సుడిగాలి సుధీర్ ఎలాగైతే తన యాటిట్యూడ్‌తో పేరుతెచ్చుకున్నాడో సేమ్ అలాగే రవి కూడా అమ్మాయిల మధ్య రొమాంటిక్ యంగ్ మ్యాన్ గా గుర్తింపు పొందాలని తెగ ప్రయత్నిస్తున్నాడు.

    లోకల్ గ్యాంగ్స్ కొత్త ఎపిసోడ్ ప్రోమోలో రవి ఏకంగా జడ్జి స్థానంలో ఉన్న అనసూయకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. దీంతో అనసూయ ఫ్రెండ్లీగానే తిరస్కరించింది. అంతే కాదు చీచీ అంటూ సైగలు చేసింది. అంతేకాదు యాంకర్ ప్రదీప్‌తో కలిసి రవి తనకు పెళ్లి చేసుకోవాలని ఉందంటూ చేసిన కామెంట్స్‌తో అంతా ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. అయితే ప్రదీప్ వేసిన పంచుతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
    Published by:Krishna Adithya
    First published: