యాంకర్ శ్రీముఖి దమ్ బిర్యానీ.. రవి అదిరే బోటి కూర..

Ravi Srimukhi: లాక్ డౌన్ కావడం.. ఇంట్లోనే లాక్ అయిపోవడంతో ఎప్పుడూ బిజీగా ఉండే సెలబ్రిటీస్‌కు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. దాంతో హాయిగా ఇంట్లో ఉండి సినిమాలు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 3, 2020, 5:49 PM IST
యాంకర్ శ్రీముఖి దమ్ బిర్యానీ.. రవి అదిరే బోటి కూర..
రవి, శ్రీముఖి (Facebook)
  • Share this:
లాక్ డౌన్ కావడం.. ఇంట్లోనే లాక్ అయిపోవడంతో ఎప్పుడూ బిజీగా ఉండే సెలబ్రిటీస్‌కు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. దాంతో హాయిగా ఇంట్లో ఉండి సినిమాలు చూడటంతో పాటు ఎప్పుడూ వంట రూమ్‌లోకి కూడా వెళ్లని వాళ్లు కూడా అక్కడికి వెళ్లి హాయిగా కొత్త కొత్త వంటలు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మొన్నటికి మొన్న యాంకర్ ప్రదీప్ కిచెన్‌లో చాలా ప్రయోగాలు చేసాడు. ఇప్పుడు యాంకర్ శ్రీముఖి, రవి కూడా ఇదే చేసారు. ఈ ఇద్దరూ కూడా డిలీసియస్ ఫుడ్ రెడీ చేసి అభిమానులతో పంచుకున్నారు. యాంకర్‌ శ్రీముఖి కూడా అదిరిపోయే చికెన్ దమ్‌ బిర్యాని వండింది.


అంతే కాదు.. ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి ఫ్యాన్స్‌కు ఎలా చేయాలో కూడా చెప్పింది. ఈ వీడియో ప్రస్తుతం బాగానే వైరల్ అవుతుంది. మరోవైపు యాంకర్ రవి కూడా తెలంగాణ స్టైల్లో అదిరిపోయే స్పైసీ స్పైసీ బోటి కూర చేసాడు. దాన్ని తన యూ ట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసాడు. భార్య నిత్యాతో కలిసి ఈ బోటి కర్రీ చేసాడు రవి. మధ్యలో కామెడీ చేస్తూ.. భార్యతో చివాట్లు తింటూ తన బోటిని ప్రిపేర్ చేసాడు యాంకర్ రవి. అది చూసి అంతా లొట్టలేస్తున్నారు.

లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండాల్సి రావడంతో వంటలు నేర్చుకునే పనిలో బిజీగా మారిపోయాడు రవి. మొన్నీమధ్యే చికెన్ ఫ్రై నేర్పించాడు రవి. ఇప్పుడు బోటీ కూర అంటున్నాడు. మరోవైపు అనసూయ, రష్మి గౌతమ్ లాంటి వాళ్లు కూడా తమ ఇళ్లలో చేస్తున్న వంటకాలను చూపిస్తున్నారు. రోజా కూడా మొన్న చికెన్.. ఇప్పుడు గుత్తి వంకాయ్ అంటూ ఘుమఘుమలాడే వంటకలను సిద్ధం చేస్తుంది. సుమ కనకాల పులిహోర అయితే అదిరిపోయింది. ఇలా మొత్తానికి ఇంట్లోనే ఉంటూ అదిరిపోయే వంటలు సిద్ధం చేస్తున్నారు మన సెలబ్రిటీస్.
First published: April 3, 2020, 5:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading